Home Sports_News కోహ్లీ, రోనాల్డ్ దగ్గర పోలికలు – ముందే చెప్పిన విరాట్ కోహ్లీ

కోహ్లీ, రోనాల్డ్ దగ్గర పోలికలు – ముందే చెప్పిన విరాట్ కోహ్లీ

38

రొనాల్డోను అవసరంగా విమర్శొంచొద్దు!
రొనాల్డో సత్తాపై నాడే కోహ్లీ అలర్ట్

2026 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ జట్టు ఆడిన మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాంగో జట్టుతో జరిగిన ఈ ఆటలో 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు, విమర్శకులు అతని ఆటతీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. అతనిని జట్టులోకి తీసుకోవడమే పెద్ద తప్పు అని కొందరు వాదిస్తున్నారు. రొనాల్డో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఈ క్లిష్ట సమయంలో, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ గతంలో చెప్పిన హెచ్చరికలను ప్రపంచం గుర్తు చేసుకోవాలి. కొన్నేళ్ల క్రితం రొనాల్డో ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. పీఎస్‌జీ లాంటి బలమైన జట్టుపై రెండు గోల్స్ చేసి తన జట్టును గెలిపించాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో ఒక ముఖ్యమైన విషయం రాశాడు. కేవలం ప్రచారం కోసం, ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం కొందరు ఫుట్‌బాల్ నిపుణులు రొనాల్డోను ప్రతి వారం విమర్శిస్తారని కోహ్లీ మండిపడ్డాడు. అతను మైదానంలో అద్భుతాలు చేసినప్పుడు ఆ విమర్శకులంతా నోరు మూసుకుంటారని కోహ్లీ గుర్తు చేశాడు.

రొనాల్డో రికార్డులు సామాన్యమైనవి కావు
రొనాల్డో మునుపటి వేగాన్ని అందుకోలేకపోతున్నాడు అనేది నిజమే కావచ్చు. అంతటి మాత్రాన అతను పనికిరాడు అనడం తప్పు. 2025-26 సీజన్‌లో అల్-నస్ర్ జట్టు తరఫున రొనాల్డో 30 మ్యాచ్‌లలో 28 గోల్స్ చేశాడు. ప్రస్తుత పోర్చుగల్ జట్టులోని యువ ఆటగాళ్లతో అతనికి సరైన అవగాహన కుదరడం లేదు. అంతేకానీ అతనిలో ప్రతిభ తగ్గలేదు. ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఇంతటి గొప్ప ఆటగాడిని అవమానించడం సరైన పద్ధతి కాదు. 2022 ప్రపంచకప్ నుండి పోర్చుగల్ తప్పుకున్నప్పుడు కూడా కోహ్లీ రొనాల్డోకు పూర్తి మద్దతుగా నిలిచాడు. రొనాల్డో సాధించిన విజయాలను, రికార్డులను ఏ ఒక్క ట్రోఫీ కూడా తక్కువ చేయలేదని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రీడా అభిమానులపై రొనాల్డో చూపిన ప్రభావం చాలా గొప్పది. రొనాల్డో కఠోర శ్రమకు, అంకితభావానికి ఒక నిదర్శనమని కోహ్లీ ప్రశంసించాడు. కోహ్లీ దృష్టిలో రొనాల్డో ఎప్పటికీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆటగాడు.

తిరుగుబాటే రొనాల్డో నైజం
విమర్శలు వచ్చిన ప్రతిసారీ రొనాల్డో తనను తాను మార్చుకుంటాడు. మరింత కసిగా మైదానంలోకి వస్తాడు. విరాట్ కోహ్లీ కూడా తన క్రికెట్ కెరీర్‌లో ఇలాంటి విమర్శలను ఎదుర్కొని గొప్ప సెంచరీలతో సమాధానం చెప్పాడు. కోహ్లీ, రొనాల్డో ఇద్దరి పట్టుదల ఒక్కటే. రాబోయే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో రొనాల్డో తన అద్భుతమైన ఆటతో విమర్శకుల నోళ్లు మూయిస్తాడని క్రీడా ప్రేమికులు బలంగా నమ్ముతున్నారు. పోర్చుగల్ జట్టును అతను కచ్చితంగా ముందుకు నడిపిస్తాడని ఫుట్ బాల్ ప్రేమికులు విశ్వాసంతో ఉన్నారు.