ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఐదు దశాబ్దాలుగా విద్యారంగంలో ఏఎన్‌యూ అందిస్తున్న సేవలు, సాధించిన ప్రగతికి ఈ స్టాంప్ ప్రతీకగా నిలవనుంది. యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రత్యేక స్టాంప్‌ను రూపొందించారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే. గంగాధర రావు, రెక్టార్ ఆర్. శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ జి. సింహాచలం పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల సందర్భంగా విడుదలైన ఈ పోస్టల్ స్టాంప్ ఏఎన్‌యూ చరిత్ర, విద్యా వారసత్వాన్ని చిరస్థాయిగా గుర్తుచేసే ప్రత్యేక జ్ఞాపికగా నిలవనుంది. 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ రూపొందించిన ఈ స్టాంప్ యూనివర్సిటీతో అనుబంధం ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులకు ప్రత్యేకంగా నిలిచేలా రూపొందించారు.
#ANU #AcharyaNagarjunaUniversity #ANUGoldenJubilee #ANU50Years #GoldenJubilee #ANUPostalStamp #PostalStamp #NaraLokesh #APEducation #HigherEducation #AndhraPradeshEducation #ANUHistory #ANULegacy #UniversityJubilee #ANUStudents #ANUAlumni #ANUFaculty #EducationNews #AndhraPradesh #APNews











