Home Tech ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

రూ.2.99 లక్షల నుంచి ఐఫోన్ డ్యుయో

యాపిల్ తొలిసారిగా మడతపెట్టే ఫోన్‌ను విడుదల చేసింది. ‘ఐఫోన్ డుయో’ పేరుతో వచ్చిన ఈ ఫోన్ భారతదేశంలో రూ.2,99,900 ప్రారంభ ధరతో లభించనుంది. 256 జీబీ మోడల్ ధర రూ.2,99,900 కాగా, 512 జీబీ ధర రూ.3,24,900, 1 టెరాబైట్ ధర రూ.3,74,900, 2 టెరాబైట్ ధర రూ.4,49,900గా నిర్ణయించారు. స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 16 నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కాగా, అక్టోబర్ 23 నుంచి విక్రయాలు మొదలవుతాయి. ఐఫోన్ డుయోలో 7.6 అంగుళాల మడత తెర, 5.4 అంగుళాల బయటి తెర ఉన్నాయి. ఏ20 ప్రో చిప్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో వెనుక రెండు 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా 2 రెట్లు ఆప్టికల్ జూమ్ అందిస్తుంది. లోపలి తెరపై ఫేస్‌టైమ్ కెమెరా ఉంది. ఐఓఎస్ 27తో వచ్చే ఫోన్‌లో ఒకేసారి పలు పనులు చేసుకునేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది. భౌతిక సిమ్‌కు బదులుగా ఈసిమ్ మాత్రమే ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే లోపలి తెరపై 31 గంటలు, బయటి తెరపై 44 గంటల వరకు వీడియో చూడవచ్చని యాపిల్ తెలిపింది.

 

#Apple #iPhoneDuo #FoldableiPhone #AppleFoldablePhone #iPhoneDuoIndia #AppleIndia #iPhoneLaunch #FoldablePhone #FoldableSmartphone #A20Pro #iOS27 #iPhoneCamera #48MPCamera #MagSafe #eSIM #AppleTechnology #SmartphoneLaunch #PremiumSmartphone #TechNews #MobileNews