Home Sports_News ధోనీ–పంత్ పార్టీ.. వీడియో వైరల్

ధోనీ–పంత్ పార్టీ.. వీడియో వైరల్

కలిసి కనిపించిన క్రికెట్ లెజెండ్స్ .


భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కలిసి పార్టీ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత స్నేహితులతో జరిగిన గెట్‌టుగెదర్‌లో ఇద్దరూ సందడి చేశారు. కెమెరా ముందు నవ్వుతూ ఫోజులిచ్చిన ధోనీ, పంత్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలోని ‘చన్నా మేరేయా’ పాట వినిపించింది. ఫోటో తర్వాత కొందరు అక్కడి నుంచి వెళ్లిపోగా, సోఫాపై ఉన్న పంత్ వారిని తిరిగి పిలిచాడు. శ్రీలంకతో సిరీస్‌లో భారత్ 1-0తో విజయం సాధించగా, రెండో టెస్టులో పంత్ కీలక రికార్డు సాధించాడు. విదేశీ, తటస్థ టెస్టుల్లో భారత వికెట్‌కీపర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోనీని అధిగమించాడు. పంత్ 2,534 పరుగులతో ముందుండగా, ధోనీ 2,496 పరుగులు చేశాడు. టెస్టుల్లో 102 సిక్సర్లతో పంత్ గిల్క్రిస్ట్‌ను అధిగమించి మూడో స్థానానికి చేరాడు. మరోవైపు గాయం కారణంగా ధోనీ 2026 ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

 

#MSDhoni #RishabhPant #DhoniPant #ViralVideo #Cricket #IndianCricket #Dhoni #Pant #CricketLegends #DhoniViralVideo #RishabhPantViral #SriLankaSeries #TeamIndia #CricketNews