Home National_news పాపులేషన్ పాలిట్రిక్స్ పబ్లిక్ పల్స్… పొలిటికల్ సెన్స్

పాపులేషన్ పాలిట్రిక్స్ పబ్లిక్ పల్స్… పొలిటికల్ సెన్స్

జనాభా లెక్కలు.. రాజకీయ లెక్కలు!
దేశంలో ప్రజాస్వామ్యానికి కొత్త సవాళ్లు.

ఒక కుటుంబంలో పిల్లల సంఖ్య మారితే అది ఆ ఇంటి నిర్ణయం. కానీ ఒక రాష్ట్రంలో పిల్లల సంఖ్య తగ్గితే? ఒక ప్రాంతంలో యువత పెరిగితే? మరో రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య భారీగా పెరిగితే? అప్పుడు అది కేవలం జనాభా గణాంకం కాదు.. రాజకీయ భవిష్యత్తును మార్చే శక్తి! భారతదేశం ఇప్పుడు అలాంటి కీలక మలుపు వద్ద నిలిచింది. జననాల రేటు తగ్గుతోంది. ప్రజల ఆయుర్దాయం పెరుగుతోంది. ఉపాధి కోసం కోట్లాది మంది రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్తున్నారు. ఒకవైపు యువ జనాభాతో ఉత్సాహంగా ఉన్న రాష్ట్రాలు, మరోవైపు వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తున్న రాష్ట్రాలు. ఈ వ్యత్యాసం రేపటి ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు? కేంద్ర నిధుల్లో ఎవరి వాటా ఎంత? అభివృద్ధి వనరులు ఎక్కడికి వెళ్లాలి? అన్న ప్రశ్నలను ముందుకు తెస్తోంది. జనాభా పెరుగుదల కోసం ఎక్కువ మంది పిల్లలను కనాలని రాజకీయ నాయకులు పిలుపునివ్వడం ఈ మార్పునకు మరో కోణం. కానీ అసలు సమస్య అక్కడే లేదు. కుటుంబాలు పిల్లల సంఖ్యను నిర్ణయించేది కేవలం రాజకీయ పిలుపులతో కాదు. విద్య, ఉద్యోగం, ఇల్లు, వైద్యం, జీవన వ్యయం, భవిష్యత్తుపై భరోసా వంటి అంశాలే నిర్ణయిస్తాయి. ఇప్పుడు జనగణన-2027… నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జనాభా రాజకీయాలుగా మారుతోంది. లెక్కలు మారితే.. ప్రజాస్వామ్య సమీకరణాలు కూడా మారుతాయా?

 

#PopulationPolitics #Census2027 #IndiaPopulation #Delimitation #IndianPolitics #PoliticalRepresentation #DemographicChanges #LokSabha #PopulationGrowth #PoliticalEquations #CensusIndia #DemographicPolitics