Home Telangana ఫుల్ క్లారిటీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం

ఫుల్ క్లారిటీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం


బయటి నేతల పెత్తనంతోనేనన్న రాజన్న

కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం పెరిగిందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం లేదని తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టంగా చెప్పారు. తాను కాంగ్రెస్ నాయకులను ఎక్కడా విమర్శించలేదని, భవిష్యత్తులోనూ విమర్శించబోనని అన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను అణిచివేస్తున్న పరిస్థితిని మాత్రమే గుర్తు చేశానని వివరించారు. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం లభించాల్సిన అవసరం ఉందని రాజ్‌గోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రజాపాలనలో తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను మరింత బలంగా కొనసాగించాలని రాజ్‌గోపాల్ రెడ్డి సూచించారు. ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, పేదల కోసం ప్రభుత్వం పనిచేయాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వం సీమాంధ్ర పాలకులు లేదా సీమాంధ్ర మీడియా ప్రభావంతో నడవకూడదని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేసిన ఆయన, తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. దీంతో గతంలో చేసిన వ్యాఖ్యలపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసిన రాజ్‌గోపాల్ రెడ్డి, పార్టీపై తనకు ఉన్న నిబద్ధతను వెల్లడించారు.

 

#RajagopalReddy #KomatireddyRajagopalReddy #Congress #TelanganaCongress #CongressWorkers #TelanganaPolitics #RahulGandhi #CongressGovernment #MunugodeMLA #CongressPolitics #TelanganaNews #RajagopalReddyRemarks