Home National_news విద్యార్థి పోరు.. పార్టీల వార్

విద్యార్థి పోరు.. పార్టీల వార్



జార్ఖండ్‌లో ఉద్యోగ పరీక్షల అక్రమాలు, పేపర్‌ లీక్‌ ఆరోపణలపై విద్యార్థుల ఆందోళన 19వ రోజుకు చేరింది. జేపీఎస్సీ, జేఎస్సీసీ పరీక్షల్లో పారదర్శకత కావాలని, తమ భవిష్యత్తుతో ఆటలాడొద్దని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన ఉధృతం కావడంతో కొందరు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలు జరపాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. విద్యార్థుల నిరసన ఇప్పుడు కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ రాజకీయ పోరుగా మారుతోంది. బీజేపీ విద్యార్థులపై పోలీసుల చర్యను తప్పుబడుతూ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తోంది. నియామక పరీక్షల అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం బీజేపీ బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయంగా మలుపు తిప్పుతోందని ఆరోపిస్తోంది. విద్యార్థులపై హింసకు తావులేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. శాంతియుత నిరసన హక్కును గౌరవించాలని, సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం చూపాలని సూచించారు. దీంతో విద్యార్థుల ఆందోళనపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ మాత్రం ఈ అంశాన్ని మరింత ఉధృతం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.

 

#JharkhandStudentProtest #Jharkhand #JPSC #JSSC #ExamIrregularities #PaperLeak #StudentProtest #HemantSoren #BJP #Congress #RahulGandhi #CBIProbe #RecruitmentExam #JharkhandPolitics #Unemployment #StudentAgitation