Home Naadesam_Special కంటెంట్ సృష్టికర్తలకు బ్యాడ్ టైమ

కంటెంట్ సృష్టికర్తలకు బ్యాడ్ టైమ


యూట్యూబ్ మానిటైజేషన్ కఠినతరం.
వ్యూస్ వేట.. ఆదాయం కోసం పోరాటం.
వాచ్‌టైమ్‌ పెంపుతోసహా నిబంధనలు.

ఒకప్పుడు కెమెరా ముందు నిలబడి వీడియో తీశారు.. మరోవైపు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.. వ్యూస్‌ వచ్చాయి.. సబ్‌స్క్రైబర్లు పెరిగారు.. ఆదాయం మొదలైంది. కానీ ఇప్పుడు ఆ రోజులకు బ్రేక్ పడుతోంది. యూట్యూబ్‌ వేదికగా కెరీర్‌ నిర్మించుకోవాలనుకునే క్రియేటర్లకు ఇక ప్రతి వ్యూ.. ప్రతి నిమిషం వాచ్‌టైమ్‌ కీలకంగా మారనుంది. మానిటైజేషన్‌ తలుపులు తెరవాలంటే గతంలో ఉన్న లక్ష్యాలు సరిపోవు.. మరింత కష్టపడాల్సిందే. ముఖ్యంగా కొత్తగా ఛానెల్‌ ప్రారంభించిన వారికి ప్రేక్షకులను సంపాదించడం ఒక సవాల్‌ అయితే.. ఆ ప్రేక్షకులను ఎక్కువసేపు వీడియోలో నిలబెట్టడం మరో పెద్ద పరీక్షగా మారింది. షార్ట్స్‌తో త్వరగా వైరల్‌ కావడం మాత్రమే ఇక ఆదాయానికి హామీ ఇవ్వదు. కంటెంట్‌లో కొత్తదనం ఉండాలి.. ప్రేక్షకుడిని మళ్లీ మళ్లీ ఛానెల్‌ వైపు తీసుకొచ్చే నాణ్యత ఉండాలి. కాపీ కంటెంట్‌, తాత్కాలిక వైరల్‌ ట్రెండ్స్‌తో నెట్టుకొచ్చే రోజులు ముగుస్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. యూట్యూబ్‌ ఇప్పుడు క్రియేటర్లకు ఓ స్పష్టమైన పరీక్ష పెడుతోంది. సినిమా తీస్తే సరిపోదు.. హిట్‌ చేయాలి. వీడియో పెడితే సరిపోదు.. ప్రేక్షకుడిని నిలబెట్టాలి. అప్పుడే ఆదాయం!


కొత్తగా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి ఆదాయం పొందాలనుకునే క్రియేటర్లకు ఇకపై సవాళ్లు పెరగనున్నాయి. యూట్యూబ్‌ పార్ట్‌నర్‌ ప్రోగ్రామ్‌లో మానిటైజేషన్‌ అర్హత నిబంధనలను కఠినతరం చేస్తూ కీలక మార్పులు ప్రకటించింది. దీంతో కంటెంట్‌ క్రియేటర్లు గతంలో కంటే ఎక్కువ వ్యూస్‌, వాచ్‌టైమ్‌ సాధించాల్సి ఉంటుంది.

మానిటైజేషన్‌కు కఠిన మైన లక్ష్యాలు

ఇప్పటివరకు మానిటైజేషన్‌ కోసం గత 365 రోజుల్లో 4,000 గంటల వాచ్‌టైమ్‌ లేదా నిర్దిష్ట స్థాయిలో షార్ట్స్‌ వ్యూస్‌ అవసరమయ్యేవి. కొత్త నిబంధనల ప్రకారం ఈ అర్హత లక్ష్యాలు మరింత పెరగనున్నాయి. అయితే 1,000 మంది సబ్‌స్క్రైబర్ల నిబంధనలో మార్పు లేదని యూట్యూబ్‌ తెలిపింది. ఇప్పటికే పార్ట్‌నర్‌ ప్రోగ్రామ్‌లో ఉన్న క్రియేటర్లపై కొత్త మార్పుల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

షార్ట్స్‌ ఆదాయానికి ప్రత్యేక అర్హత

షార్ట్స్‌ ద్వారా ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం పొందాలంటే నిర్ణీత వ్యవధిలో భారీ స్థాయిలో వ్యూస్‌ సాధించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కొత్తవారితో పాటు ఇప్పటికే ఉన్న క్రియేటర్లకూ వర్తించనుంది.

ఒరిజినల్‌ కంటెంట్‌కే భవిష్యత్‌ ప్రాధాన్యం

వైరల్‌ వీడియోలపై మాత్రమే ఆధారపడటం ఇక సరిపోదు. నిరంతరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఒరిజినల్‌ కంటెంట్‌, నాణ్యమైన వీడియోలు అందించాల్సిన అవసరం పెరిగింది. కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్‌ దూరమవుతున్నా, సృజనాత్మకతతో ప్రేక్షకులను నిలబెట్టుకునేవారికి యూట్యూబ్‌లో ఆదాయ అవకాశాలు కొనసాగనున్నాయి.

 

#YouTube #YouTubeMonetization #YouTubePartnerProgram #ContentCreators #YouTubeCreators #MonetizationRules #YouTubeShorts #WatchTime #YouTubeViews #CreatorEconomy #OriginalContent #YouTubeIncome #DigitalCreators #YouTubeUpdates #ContentCreation