చీరాల పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 90 ఏళ్ల వృద్ధురాలి కోరికను నెరవేర్చి అందరి మనసులు గెలుచుకున్నారు. చీరాలకు చెందిన పుష్పావతి అనే వృద్ధురాలు తనను ఒక్కసారి కలిసి ఫోటో దిగాలని సామాజిక మాధ్యమాల ద్వారా ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, చీరాల పర్యటన సందర్భంగా తప్పకుండా కలుస్తానని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. హామీ మేరకు కార్యక్రమం అనంతరం పుష్పావతిని ప్రత్యేకంగా పిలిపించుకుని ఆప్యాయంగా పలకరించారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడి కలిసి ఫోటో దిగారు. తన చిరకాల కోరిక నెరవేరడంతో పుష్పావతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యమంత్రిని దగ్గరగా కలవడం జీవితంలో మరచిపోలేని అనుభూతి అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మగ్గంపై వస్త్రంలో చంద్రబాబు చిత్రపటాన్ని నేసిన చేనేత దంపతులు నాగేశ్వరరావు, లక్ష్మీలను కూడా సీఎం అభినందించారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన చిత్రాన్ని పరిశీలించిన ఆయన, వారి కళాత్మక ప్రతిభను ప్రశంసించారు. చేనేత కళాకారుల ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
#ChandrababuNaidu #Pushpavathi #Chirala #ChandrababuVisit #90YearOldWoman #AndhraPradeshCM #ChandrababuFan #HeartwarmingMoment #ChiralaNews #HandloomWeavers #NageswaraRao #Lakshmi #AndhraPradeshNews











