Home AP నాగార్జున యాదవ్ అరెస్ట్‌పై జోగి రమేష్ ఆగ్రహం

నాగార్జున యాదవ్ అరెస్ట్‌పై జోగి రమేష్ ఆగ్రహం

12



వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టును మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్ట్ వెనుక చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఒత్తిడి ఉందని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున యాదవ్‌ను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటి నుంచి తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని అన్నారు. తెలంగాణ పోలీసులమంటూ వచ్చి అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని గుర్తుచేశారు. స్థానిక పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణిచివేసే చర్యలు సరైనవి కావని జోగి రమేష్ పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావడానికి అధికారాన్ని వినియోగించడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నాగార్జున యాదవ్ అరెస్ట్‌పై పూర్తి వివరాలు వెల్లడించాలని, చట్టబద్ధమైన విధానాలను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.