వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక చేంజింగ్ రూమ్

41

భారత క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సీనియర్ భారత జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన సూర్యవంశీ, ఈ పర్యటనలో అరంగేట్రం చేస్తే అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. అయితే, బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం.. ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్‌కు ప్రత్యేక చేంజింగ్ రూమ్ కేటాయించనున్నారు. ఐసీసీ, ఈసీబీ నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు ఆటగాళ్లు పెద్దల చేంజింగ్ రూమ్‌లను ఉపయోగించకూడదు. ఈ ‘సేఫ్‌గార్డింగ్’ నిబంధనల కారణంగానే అతనికి అన్ని వేదికల్లో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండేందుకు, జట్టు సమావేశాల్లో పాల్గొనేందుకు అతనికి అనుమతి ఉంటుంది. కేవలం బట్టలు మార్చుకునే సమయంలోనే ఈ నిబంధన వర్తిస్తుంది. కాగా, అతను చిన్నపిల్లవాడు కావడం వల్ల ఈ పర్యటనలో అతని తల్లిదండ్రులు కూడా వెంట ఉండేందుకు బీసీసీఐ ప్రత్యేక అనుమతిని ఇచ్చింది.

 

#VaibhavSuryavanshi #TeamIndia #IndianCricket #IrelandTour #EnglandTour #BCCI #IPL2026 #YoungCricketer #CricketNews #SafeguardingRules #ECB #ICC #CricketRecords #IndianTeam #Debut #FutureStar #CricketUpdates #SportsNews #ParentsSupport #VaibhavDebut