నిబంధనల ఉల్లంఘన వ్యవహారం – సహచరులకు బెన్ స్టోక్స్ క్షమాపణలు

40

జట్టు నిబంధనలను, ప్రోటోకాల్స్ ఉల్లంఘించడం వల్ల న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఈ ఘటనపై తన సహచర ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పారు. లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్టు విజయం తర్వాత ఒక నైట్‌క్లబ్ ఘటన, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను స్టోక్స్‌తో పాటు పేసర్ గస్ అట్కిన్సన్‌పై ఈసీబీ విచారణ జరిపి, లిఖితపూర్వక హెచ్చరిక జారీ చేసింది.
బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో స్టోక్స్ మాట్లాడుతూ.. “ఒక కెప్టెన్‌గా నేను ముందుగా జట్టుకు క్షమాపణలు చెప్పాను. నా ప్రవర్తన వల్ల జట్టుతో పాటు కొత్తగా అరంగేట్రం చేసిన ఆటగాళ్లపై కూడా ప్రభావం పడింది. తప్పు జరిగినప్పుడు బాధ్యత తీసుకోవడం ముఖ్యం” అని పేర్కొన్నారు. గురువారం నుండి ప్రారంభం కానున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టుకు స్టోక్స్ తిరిగి జట్టులోకి వచ్చి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంపైనే ప్రస్తుతం తమ దృష్టి ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

#BenStokes #EnglandCricket #ENGvsNZ #NewZealandCricket #TestCricket #LordsTest #ECB #GusAtkinson #CricketNews #EnglandCaptain #ThirdTest #CricketUpdates #TeamProtocol #SportsNews #EnglandVsNewZealand #TestSeries #CaptainApology #CricketHeadlines #WorldCricket #ENGNZ