జాతీయ రహదారిపై ‘నాకా బందీ’.. కారంచేడు ఎస్ఐ ఆధ్వర్యంలో నిఘా

5

కారంచేడు, జూన్ 24(నాదేశం) : శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపులో భాగంగా బాపట్ల జిల్లా కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 167A జాతీయ రహదారి పై బుధవారం పోలీసులు నాకా బందీ నిర్వహించారు. కారంచేడు ఎస్సై ఖాదర్ భాషా ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది హైవేపై వ్యూహాత్మకంగా మొహరించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు
సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న అనుమానిత వాహనాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ నాకా బందీ చేపట్టారు. ముఖ్యంగా నంబర్ ప్లేట్లు సరిగా లేని ద్విచక్ర వాహనాలు, అనుమానాస్పద కార్లు, ఇతర వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కారంచేడు ఎస్సై ఖాదర్ భాషా మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో ఇలాంటి నిఘా చర్యలు మరియు నాకా బందీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసుల తనిఖీలకు సహకరించాలని, సరైన పత్రాలతోనే ప్రయాణాలు సాగించాలని కోరారు. ఈ తనిఖీల్లో కారంచేడు పోలీస్ స్టేషన్ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

 

#Karamchedu #BapatlaPolice #NakaBandi #NH167A #PoliceChecking #RoadSafety #LawAndOrder #KhadarBashaSI #VehicleInspection #TrafficEnforcement #CrimePrevention #HighwayPatrol #AndhraPradeshPolice #PublicSafety #VehicleDocuments #NightPatrolling #PoliceAwareness #BapatlaDistrict #KaramcheduNews #SecurityMeasures