మొదటి విడతలో క్లారిటీ!
రెండు, మూడో విడతలో బొమ్మ కన్పించబోతుందా..!?
ఏకగ్రీవాలతోనే కూటమి ఆధిక్యమా?
గ్రామీణ రాజకీయాల్లో అసలు బలమెంత?
నగరాల్లో గెలిచినంత మాత్రాన పల్లెలు కూడా జై కొట్టినట్టేనా? మున్సిపల్ విజయాలే గ్రామీణ రాజకీయాలకు కొలమానమా? ఏపీ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాలు ఇప్పుడు అధికార కూటమికి సంబరాన్ని.. వైసీపీకి కొత్త ఆశను కలిగిస్తున్నాయి! 2,540 స్థానాలతో కూటమి మద్దతుదారుల స్పష్టమైన ఆధిక్యం.. 1,111 స్థానాలతో వైసీపీ మద్దతుదారుల ఉనికి! పైకి కనిపిస్తున్నది కూటమి జోరు.. లోపల కనిపిస్తున్నది వైసీపీ పోరాటం! అయితే అసలు కథ ఇక్కడే ఉంది. 760 ఏకగ్రీవాలు కూటమి ఖాతాలో చేరితే.. ప్రత్యక్ష పోటీలో ఓటరు ఎవరికి పట్టం కట్టాడు? ఏకగ్రీవాలను పక్కనపెడితే రాజకీయ బలాబలాల లెక్క మారుతుందా? 77.65 శాతం పోలింగ్‌తో పల్లె ఓటరు ఇచ్చిన తీర్పులో దాగిన అసలు సందేశం ఏమిటి? కుప్పం నుంచి పులివెందుల వరకు.. తిరుపతి నుంచి అల్లూరి జిల్లా వరకు స్థానిక సమీకరణాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి? పార్టీ గుర్తులపై జరగని ఎన్నికల్లో ఈ విజయాలన్నీ పార్టీల ఖాతాలో వేయవచ్చా? ఇప్పుడు నేడు జరుగుతున్న రెండో విడతపై అందరి చూపు! కూటమి ఆధిక్యం నిజమే.. కానీ వైసీపీ గ్రామీణ బలం ఏంటో రెండు, మూడో విడతల్లో పూర్తిగా స్పష్టం కాబోతుంది.
#APPanchayatElections #FirstPhaseResults #NDAAlliance #YSRCP #AndhraPradeshPolitics #RuralPolitics #PanchayatElectionResults #UnanimousElections #SecondPhasePolling #ThirdPhaseElections











