బిస్లరీపై విష ప్రచారమా? నాణ్యతపై యుద్ధమా?
రిలయన్స్ క్యాంపా చుట్టూ అనుమానాలు!
ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యల వెనుక అసలు కథేంటి?
ఒకప్పుడు థమ్స్ అప్, గోల్డ్ స్పాట్ వంటి సంచలన బ్రాండ్లను కోకాకోలా చేతుల్లో పెట్టిన పార్లే దిగ్గజం రమేష్ చౌహాన్.. ఇప్పుడు తన బిస్లరీ బ్రాండ్‌ను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? దశాబ్దాలుగా కోట్లాది మంది నమ్మకానికి ప్రతీకగా నిలిచిన బిస్లరీ నీళ్లలో ప్రమాదకర రసాయనాలున్నాయంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బ్రోమేట్ నుంచి క్యాన్సర్ కారకాల వరకు వినిపిస్తున్న ఆరోపణలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. అయితే బిస్లరీ మాత్రం పరీక్షల నివేదికల్లో తేడాలున్నాయని, తమ ఉత్పత్తుల నాణ్యతపై నమ్మకం ఉందని చెబుతోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది! బిస్లరీపై ఆరోపణలు వస్తున్న సమయంలోనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ క్యాంపా ష్యూర్తో నీటి వ్యాపారంలో దూసుకొస్తున్నారు. మరి ఇది కేవలం ఆహార భద్రత కోసం జరుగుతున్న చర్యనా? మార్కెట్లో ఆధిపత్య పోరుకు తెరలేపిన పరిణామమా? ఎఫ్ఎస్ఎస్ఏఐ వెనుక రిలయన్స్ ఉందన్న అనుమానాలకు ఆధారాలున్నాయా? దేశవ్యాప్తంగా బిస్లరీకి ముప్పు పొంచి ఉందా? నీళ్ల వ్యాపారంలో నాణ్యతా యుద్ధమా.. కార్పొరేట్ కుర్చీలాటనా? అసలు నిజం ఏమిటి?
#Bisleri #FSSAI #CampaSure #Reliance #MukeshAmbani #RameshChauhan #WaterQuality #PackagedDrinkingWater #FoodSafety #IndiaBusiness










