Home AP పొలిటికల్ మ్యాప్ చేంజ్ ఏపీలో ఎవరికి అడ్వాంటేజ్

పొలిటికల్ మ్యాప్ చేంజ్ ఏపీలో ఎవరికి అడ్వాంటేజ్

పునర్విభజనతో పెరిగే సీట్లు కీలకం.
జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మకం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మ్యాప్!
38 ఎంపీలు.. 263 ఎమ్మెల్యేలు.. మారనున్న లెక్కలు!

ఒక కొత్త మ్యాప్‌.. వందలాది కొత్త రాజకీయ అవకాశాలు.. అధికార పార్టీలకు ఊహించని సవాళ్లు! ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే మారిపోనుందా? ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ స్థానాలు 38కు పెరిగితే రాజకీయ పోరాటం ఏ స్థాయికి చేరుతుంది? 175 అసెంబ్లీ స్థానాలు 263కు చేరితే ఏ జిల్లాకు ఎన్ని సీట్లు దక్కుతాయి? విశాఖ నుంచి విజయవాడ వరకు, గుంటూరు నుంచి రాయలసీమ వరకు నియోజకవర్గాల సరిహద్దులు మారితే పాత రాజకీయ లెక్కలన్నీ తలకిందులవుతాయా? పెద్ద నియోజకవర్గాలు విడిపోతాయా? కొత్త రాజకీయ కేంద్రాలు పుట్టుకొస్తాయా? పట్టణ జనాభా పెరుగుదలతో విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రాంతాలకు అదనపు ప్రాధాన్యం దక్కుతుందా? అసలు ట్విస్ట్‌ రిజర్వేషన్లలో ఉంది! మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం, ఎస్సీ, ఎస్టీ స్థానాల పెంపు, కులగణన నేపథ్యంలో బీసీల రాజకీయ హక్కులు.. ఇవన్నీ కొత్త సమీకరణాలకు తెరతీయనున్నాయి. మరోవైపు అధికార పార్టీలకు అనుకూలంగా సరిహద్దులు మార్చే జెర్రీమాండరింగ్‌ ప్రమాదం కూడా చర్చకు వస్తోంది. ఏ ప్రాంతానికి లాభం? ఏ నాయకుడి రాజకీయ భవిష్యత్తు మారుతుంది? బీసీలకు న్యాయం జరుగుతుందా? 38 ఎంపీ స్థానాల వెనుక ఉన్న అసలు రాజకీయ లెక్కలు, జిల్లాల వారీగా మారబోయే ముఖచిత్రంపై ప్రత్యేక విశ్లేషణ!

 

#AndhraPradesh #Delimitation #APPolitics #LokSabhaSeats #AssemblySeats #38MPSeats #263MLASeats #WomenReservation #BCRepresentation #ConstituencyReorganisation