ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా రాంరాం!

45

రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రపంచంలో ఒక ఊహించని సంచలన ట్రేడింగ్ ఒప్పందానికి తెరలేచింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం లీక్ అయింది. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ నుండి ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీనికి తోడు ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య నెలకొన్న విభేదాలు, కెప్టెన్సీ వివాదాల వల్ల అతను తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాను ముంబై ఫ్రాంచైజీ నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లు యాజమాన్యానికి స్పష్టం చేశాడు. హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ప్రస్తుతం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

ముంబై ఇండియన్స్ జట్టులోకి యశస్వి జైస్వాల్

హార్దిక్ పాండ్యాను వదులుకోవడానికి సిద్ధమైన ముంబై ఇండియన్స్, అందుకు బదులుగా రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తమ జట్టులోకి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. రాజస్థాన్ జట్టులో సంజూ శాంసన్ నిష్క్రమణ తర్వాత జైస్వాల్ కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు, కానీ యాజమాన్యం రియాన్ పరాగ్‌కు ఆ బాధ్యతలు అప్పగించడంతో జైస్వాల్ కూడా అసంతృప్తిగా ఉన్నాడు. ముంబై రంజీ జట్టుకు ఆడే జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్ లోకి రావడం కెరీర్ పరంగా కలిసిసొచ్చే అంశం. రోహిత్ శర్మ కెరీర్ ముగింపునకు రావడం, సూర్యకుమార్ యాదవ్ కూడా వేరే జట్టుకు వెళ్లే ఆలోచనలో ఉండటంతో ముంబై జట్టుకు కొత్త సూపర్ స్టార్ అవసరం ఏర్పడింది. ఈ మెగా ట్రేడింగ్ ఒప్పందం గనుక కుదిరితే రాబోయే ఐపీఎల్ సీజన్ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.

 

#HardikPandya #YashasviJaiswal #MumbaiIndians #RajasthanRoyals #IPL2026 #IPLTrade #IPLNews #CricketNews #HardikToRR #JaiswalToMI #RohitSharma #SuryakumarYadav #RiyanParag #SanjuSamson #MumbaiIndiansNews #RajasthanRoyalsNews #IPLTransfers #IPLUpdates #IndianPremierLeague #CricketUpdates #MI #RR #T20Cricket #SportsNews #IPLBuzz