Home AP ఈ చరిత్ర ఏ సిరాతో.. బద్వేల్‌లో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు?

ఈ చరిత్ర ఏ సిరాతో.. బద్వేల్‌లో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు?

స్వేచ్ఛ కావాలంటున్న స్థానికులు
తరం మారిందా.. మార్చేస్తున్నారా..!?
టీడీపీ ఇన్‌ఛార్జి మంచూరుపై ఆగ్రహం
సర్పంచ్ ఎన్నికల్లో ఓటు కోసం సమరం


ఒకప్పుడు బద్వేలు ఎన్నికలంటే ప్రజల సందడి.. నాయకుల మధ్య హోరాహోరీ పోరు.. గెలుపోటముల మధ్య ప్రజాతీర్పునకు పెద్దపీట! కానీ ఇప్పుడు అదే బద్వేలు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. 40 వార్డులకు 39 ఏకగ్రీవాలు.. ఒక్క వార్డులోనే పోలింగ్! నాలుగు నెలల క్రితం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో ఈ రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదేనా రాజకీయ రికార్డు? ప్రజాభిమానంతో సాధించిన విజయమా? ప్రత్యర్థులకు పోటీ చేసే అవకాశమే లేకుండా ఏర్పడిన పరిస్థితులా? నామినేషన్ పత్రాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, అభ్యర్థుల ఫిర్యాదులు, అధికారుల తీరుపై అనుమానాలు ఇప్పుడు బద్వేలు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఆరోపణలను సూర్యనారాయణ రెడ్డి ఖండిస్తున్నా.. ప్రజల ముందున్న ప్రశ్నలకు సమాధానాలు కావాల్సిందే. 2021లో 35 వార్డుల్లో పోటీ జరిగి వైసీపీ 28 స్థానాలు గెలుచుకున్న బద్వేలులో ఐదేళ్లలోనే పరిస్థితి ఎందుకిలా మారింది? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వివాదం పల్లెల్లోకి విస్తరిస్తోంది. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. నాయకుల ఆధిపత్య పోరులో ఓటరు ఎందుకు బలికావాలి? బద్వేలు చరిత్ర ఏ సిరాతో రాయబడుతోంది?

 

#Badvel #BadvelElections #AndhraPradeshPolitics #TDP #ManchuruSuryaNarayanaReddy #MunicipalElections #SarpanchElections #VoterRights #LocalBodyElections