Home AP కాక రేపుతున్న జగన్ రాక!

కాక రేపుతున్న జగన్ రాక!

ఓటు వేసి ఇంటికి వెళ్లాల్సిందే!
జగన్ అయినా.. మరెవరైనా..
చట్టం ముందు అందరూ సమానమే!
డీఐజీ ప్రకటనతో పులివెందులలో హైఅలర్ట్!

పులివెందులలో రాజకీయం రగులుతోంది. పోలింగ్ వేళ అసలేం జరగబోతోంది? మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో చొక్కా మడతపెట్టి చేసిన సవాల్‌కు ఇప్పుడు పోలీసు శాఖ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. వస్తే రావచ్చు.. ఓటు వేయొచ్చు.. కానీ ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాల్సిందే! అంటూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ అయినా.. మరెవరైనా.. చట్టం ముందు అందరూ సమానమేనన్న సంకేతాలు పంపింది. మరోవైపు పులివెందుల చుట్టూ పోలీసుల భారీ బందోబస్తు.. మూడు వేల మంది సిబ్బంది మోహరింపు.. పట్టణంలోకి వచ్చే 17 మార్గాల్లో తనిఖీలు.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా! అటు పోలీసులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు.. ఇటు అధికారుల సమాధానాలు! ఈ పరిణామాల మధ్య బాకరాపురం పోలింగ్ కేంద్రానికి జగన్ రాక ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఓటు వేసి వెనుదిరుగుతారా? లేక రాజకీయ సవాల్‌కు మరో రూపం ఇస్తారా? పులివెందులలో జరగబోయేది సాధారణ పోలింగేనా? రాజకీయ ప్రతిష్ఠకు పరీక్షా? మాటల యుద్ధానికి తెరపడేది ఎప్పుడు? అసలు పరీక్ష మొదలయ్యేది ఇప్పుడు!

 

#YSJagan #Pulivendula #YSRCP #KoyaPraveen #AvinashReddy #PollingDay #ElectionSecurity #AndhraPradeshPolitics #PoliceDeployment #PulivendulaPolling #APNews