Home Sports_News ముంబై ఇండియన్స్‌లోకి ఉతప్ప

ముంబై ఇండియన్స్‌లోకి ఉతప్ప

కోచింగ్ టీమ్‌లో భారీ మార్పులు!

ఐపీఎల్‌ 2027కు ముందే ముంబై ఇండియన్స్‌ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. జట్టును మళ్లీ ఛాంపియన్‌ ట్రాక్‌పైకి తీసుకురావడమే లక్ష్యంగా కోచింగ్‌ విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. భారత మాజీ స్టార్‌ బ్యాటర్‌, రెండుసార్లు ఐపీఎల్‌ విజేత రాబిన్‌ ఉతప్పకు బ్యాటింగ్‌ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ మిచెల్‌ మెక్‌క్లెనగన్‌ బౌలింగ్‌ కోచ్‌గా, టీ దిలీప్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా, ధావల్‌ కులకర్ణి డెవలప్‌మెంట్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమితులయ్యారు. ఇప్పటికే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కీరన్‌ పొలార్డ్‌ నేతృత్వంలో కొత్త కోచింగ్‌ బృందం సిద్ధమైంది. మహేల జయవర్ధనే స్థానంలో పొలార్డ్‌ రావడంతో పాటు లసిత్‌ మలింగ, పరాస్‌ మాంబ్రే, కార్ల్‌ హాప్కిన్సన్‌లతో ముంబై వీడ్కోలు పలికింది. ఉతప్పకు ముంబైతో అనుబంధం ప్రత్యేకం. 2008 తొలి ఐపీఎల్‌ సీజన్‌లో ఇదే జట్టుతో తన ప్రయాణం ప్రారంభించిన ఆయన, ఇప్పుడు కోచ్‌గా తిరిగి రావడం విశేషం. మొత్తం 205 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 4,952 పరుగులు చేసిన ఉతప్ప 2014లో కోల్‌కతా, 2021లో చెన్నై జట్లతో టైటిళ్లు గెలిచారు. మెక్‌క్లెనగన్‌ ముంబై తరఫున 56 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసి 2015, 2019 టైటిల్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అభిమానుల నమ్మకాన్ని తిరిగి సంపాదించి, స్వదేశంతో పాటు విదేశీ మైదానాల్లోనూ సత్తా చాటడమే లక్ష్యమని ఉతప్ప స్పష్టం చేశారు. డిసెంబర్‌ 16న గోవాలో జరగనున్న మినీ వేలంతో కొత్త టీమ్‌ అసలు కసరత్తు ప్రారంభం కానుంది. ముంబై మళ్లీ మకుటం దక్కించుకుంటుందా అన్న ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైంది!

 

#MumbaiIndians #RobinUthappa #IPL2027 #KieronPollard #MitchellMcClenaghan #TDilip #DhawalKulkarni #IPLCoachingStaff #IPLUpdates #CricketNews #MumbaiIndiansFans