సీఐఐ సదస్సుకు బొలిశెట్టి విజ్ఞప్తి.
విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరుగుతున్న 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్–2026కు హాజరవుతున్న భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సహా ప్రముఖులకు పర్యావరణ కార్యకర్త, జల బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ స్వాగతం పలికారు. సుమారు 3,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. అదే సమయంలో కాలుష్యరహిత పరిశ్రమలు, గ్రీన్ టెక్నాలజీ, నీటి వనరుల పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఐఐకి విజ్ఞప్తి చేశారు. 2026 యేల్ పర్యావరణ పనితీరు సూచీ ప్రకారం 177 దేశాల్లో భారత్ 176వ స్థానంలో ఉందని పేర్కొంటూ పర్యావరణ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు.
డేటా సెంటర్లపై శాస్త్రీయ చర్చ జరగాలి
హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుపైనా బొలిశెట్టి కీలక ప్రశ్నలు లేవనెత్తారు. వీటికి అవసరమైన భారీ విద్యుత్, నీటి వినియోగం పర్యావరణంపై చూపే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలని సూచించారు. వేల మెగావాట్ల డేటా సెంటర్ల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు, నీటి అవసరాలు, విద్యుత్ సరఫరా, పర్యావరణ ప్రభావాలపై సదస్సులో బహిరంగంగా శాస్త్రీయ చర్చ జరగాలని కోరారు. రాజకీయ నిర్ణయాలకు పరిమితం కాకుండా నిపుణుల అధ్యయనాల ఆధారంగా విధానాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. సీఐఐ సదస్సు కేవలం పెట్టుబడుల వేదికగా మిగలకుండా పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామిక అభివృద్ధికి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాలని బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు.
#BolisettiSatyanarayana #CIIPartnershipSummit2026 #Visakhapatnam #AndhraPradesh #EnvironmentalProtection #GreenTechnology #WaterConservation #CarbonEmissions #DataCenters #SustainableDevelopment #PollutionFreeIndustries











