Home AP చిరు పీఆర్పీ వైండప్ విసా రెడ్డి పీఆర్పీ థంప్సప్

చిరు పీఆర్పీ వైండప్ విసా రెడ్డి పీఆర్పీ థంప్సప్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘పీఆర్పీ’ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. సామాజిక మార్పు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీకి ప్రజలు సుమారు 18 శాతం ఓట్లు, 18 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించలేకపోయిన చిరంజీవి 2011లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో ప్రజారాజ్యం రాజకీయ ప్రస్థానానికి తెరపడింది. ఒకప్పుడు భారీ అంచనాలతో మొదలైన పార్టీ చివరకు కనుమరుగవడం రాజకీయ చరిత్రలో ప్రత్యేక పరిణామంగా నిలిచింది.

అదే పేరు.. మరో రాజకీయ ప్రయోగం

ఇప్పుడు విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ) పేరుతో కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టడం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి పీఆర్పీకి ముగింపు పలికిన చోట, విజయసాయి అదే సంక్షిప్త పేరుతో కొత్త రాజకీయ ఆశలు రేకెత్తిస్తున్నారు. నాడు చిరంజీవి ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో ముందుకొస్తే, నేడు విజయసాయి 2029 లక్ష్యంగా స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రకటిస్తున్నారు. అయితే పేరు ఒక్కటే రాజకీయ విజయాన్ని అందించదు. బలమైన నాయకత్వం, ప్రజల విశ్వాసం, క్షేత్రస్థాయి బలం అవసరం. చిరంజీవి ప్రయోగం ఇచ్చిన అనుభవాల నుంచి విజయసాయి ఏం నేర్చుకుంటారు? ఆయన పీఆర్పీ రాజకీయాల్లో నిలదొక్కుకుంటుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న.

 

#PRP #PrajaRajyamParty #ParivartanaRajaneethiParty #Chiranjeevi #VijayasaiReddy #AndhraPradeshPolitics #APPolitics #2029Elections #PoliticalNews