ఇళయరాజా అభ్యంతరాలు ఎందుకు?
గరివిడి లక్ష్మి ఆరోపణల్లో నిజమెంత?
పాట ఎవరిది.. హక్కులు ఎవరికి?
జానపదం నుంచి కోర్టు వరకు పోరాటం!
ఒక పాట పుడుతుంది.. కోట్లాది హృదయాలను గెలుస్తుంది! తరతరాలుగా ప్రజల నాలుకలపై నడిచే జానపదం వెండితెరపై మెరిస్తుంది. కానీ ఆ పాట వెనుక అసలు సృజనకర్త ఎవరు? దాని ద్వారా వచ్చే ఆదాయం ఎవరికి చెందాలి? గుర్తింపు పొందాల్సిన కళాకారుడికి అన్యాయం జరిగితే అడిగేదెవరు? ఇప్పుడు ఈ ప్రశ్నలే సంగీత ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. గరివిడి లక్ష్మి ఆవేదన ఒకవైపు.. ఆమె ఆరోపణలను ఖండిస్తున్న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వాదన మరోవైపు! ఇంతలోనే దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, సరిగమా మధ్య కాపీరైట్ పోరు కోర్టుల గడప తొక్కింది. సంగీత రచన ఒకరిది.. అసలు రికార్డింగ్ హక్కులు మరొకరివా? జానపద బాణీ ప్రజల సంపదా? దానికి కొత్త రూపమిచ్చిన కళాకారుడి హక్కుల సంగతేంటి? డిజిటల్ యుగంలో పాత పాటలే కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న వేళ ఈ ప్రశ్నలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆరోపణలు నిజాలవుతాయా? ఒప్పందాలు ఎవరికి అండగా నిలుస్తాయి? బయోపిక్‌లో కనిపించినదంతా వాస్తవమేనా? పాట వెనుక దాగిన హక్కుల లెక్కలు.. కళాకారుల ఆవేదన.. కోర్టుల కీలక పరిశీలనలు! అసలు వివాదం ఏమిటి? న్యాయం ఎవరి పక్షాన నిలుస్తుంది?
#MusicCopyright #Ilaiyaraaja #Saregama #GarividiLakshmi #RPPatnaik #CopyrightDispute #FolkSongs #MusicRights #MusicRoyalties #ArtistsRights #IndianMusicIndustry #TeluguNews











