మరోసారి చర్చలు.. నేతల పాట్లు.
విశాఖ రాజకీయాల్లో కూటమి సీట్ల సర్దుబాటు కొత్త మలుపు తిరిగింది. 120 వార్డులు.. 1,672 నామినేషన్లు.. పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఆశావహులు.. వెరసి జీవీఎంసీ ఎన్నికలు కూటమి నేతలకు సవాల్‌గా మారాయి. తెలుగుదేశం 79, జనసేన 30, బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేయాలన్న ప్రాథమిక అంచనాల మధ్య జనసేన తన బలానికి తగ్గట్టుగా 36 స్థానాలు కావాలని పట్టుబట్టడంతో సీట్ల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. మరోవైపు నేతల హామీలతో ఇప్పటికే రంగంలోకి దిగిన ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసి వెనక్కి తగ్గేది లేదంటున్నారు. పార్టీ కోసం ఇన్నాళ్లు పనిచేసినా ఇప్పుడు త్యాగాలు చేయాలనడం ఏమిటంటూ కొందరు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఎవరిని బుజ్జగించాలి.. ఎవరికి సీటు ఇవ్వాలి.. ఎవరిని బరిలో నుంచి తప్పించాలి? అన్న ప్రశ్నలు కూటమి నేతలను వెంటాడుతున్నాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు నేపథ్యంలో మరోసారి చర్చలకు రంగం సిద్ధమైంది. ఇదే సమయంలో అనకాపల్లిలో ఆరు వార్డులకు కూటమి తరఫున ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడం చర్చనీయాంశమైంది. చివరకు పొత్తు ధర్మం గెలుస్తుందా? ఆశావహుల పట్టుదల పైచేయి సాధిస్తుందా? సీట్ల సర్దుబాటులో ఎవరు తగ్గుతారు.. ఎవరు తొడగొట్టి నిలబడతారు? విశాఖ కూటమిలో అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది!
#GVMCElections #VisakhapatnamPolitics #JanaSena #TDP #BJP #SeatSharing #AndhraPradeshPolitics #MunicipalElections #CoalitionPolitics #Anakapalli











