Home AP ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరం ఎందుకీ రాజకీయ రణరంగం..!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరం ఎందుకీ రాజకీయ రణరంగం..!

పోరులో నెత్తురు పారాల్సిందేనా?
నామినేషన్ల దగ్గరే కూటమి, వైసీపీ హోరాహోరీ!
రెండున్నరేళ్ల రాజకీయ సవాల్‌.. నామినేషన్ల చుట్టూ వివాదం.

స్థానిక ఎన్నికలు.. కానీ పోరు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది! నామినేషన్ల దశలోనే రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. రాయలసీమ నుంచి పల్నాడు వరకు, ప్రకాశం నుంచి తిరుపతి వరకు ఉద్రిక్తతలు, ఘర్షణలు, పరస్పర ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే.. ప్రతిపక్షమే గొడవలకు కారణమంటూ టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ జగన్‌ విమర్శలు.. ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదులు.. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణపై అధికార యంత్రాంగం దృష్టి! అసలు తప్పెవరిది? అడ్డంకులు నిజంగానే ఎదురయ్యాయా? లేక రాజకీయ ఆరోపణలే ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నాయా? ఈ పోరు వెనుక కేవలం వార్డులు, కౌన్సిలర్‌ స్థానాల లెక్కలే ఉన్నాయా? అధికార కూటమికి ఇది పాలనపై ప్రజాభిప్రాయానికి పరీక్ష… వైసీపీకి రాజకీయ పునరుజ్జీవనానికి అవకాశమా? ‘ఇప్పుడు మీ వంతు.. రెండున్నరేళ్ల తర్వాత మా వంతు’ అంటూ వైసీపీ నేతల సవాళ్లు రాజకీయ పోరుకు మరింత పదును పెడుతున్నాయి. కానీ ఈ కుర్చీల పోరులో ప్రజాస్వామ్యమే బలిపశువవుతుందా? ప్రత్యర్థిని ఓడించాలనే పట్టుదల.. నామినేషన్‌ వేయనివ్వని పరిస్థితుల ఆరోపణల వరకు ఎందుకు చేరింది? ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిది అన్నది తర్వాత.. ముందుగా ప్రశాంతంగా పోటీ చేసే హక్కు ఎవరు కాపాడతారు? అసలు కథేంటి?

 

#AndhraPradesh #LocalBodyElections #TDP #YSRCP #ChandrababuNaidu #YSJagan #NominationClashes #ElectionControversy #Rayalaseema #Palnadu #TirupatiPolitics #APPolitics