Home National_news జనగణన రెండో దశ ఖరారు

జనగణన రెండో దశ ఖరారు

ఇంటి వద్దకే అధికారుల రాక.
జనవరి 10 నుంచి స్వీయ గణన.

తెలంగాణలో జనగణన-2027 రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలకు స్వీయ గణన (సెల్ఫ్‌ ఎన్్యూమరేషన్‌) చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అనంతరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియలో సేకరించిన వివరాల పరిశీలన, సవరణల కోసం మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్‌ రౌండ్‌ నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ 30న జారీ చేసిన నోటిఫికేషన్‌ను పునఃప్రచురిస్తూ తెలంగాణ ప్రభుత్వం నవంబర్‌ 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనగణన రెండో దశ షెడ్యూల్‌ ఖరారైంది.

ఇప్పటికే పూర్తయిన తొలి దశ ప్రక్రియ

జనగణన-2027లో భాగంగా తొలి దశను తెలంగాణలో ఈ ఏడాది నిర్వహించారు. ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించగా, మే 11 నుంచి జూన్‌ 9 వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేశారు. ఇప్పుడు రెండో దశలో జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. ప్రజలు జనవరి 10 నుంచి 24 మధ్య స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత అధికారుల ఇంటింటి సర్వే కొనసాగుతుంది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగే ఈ ప్రక్రియలో ఎవరూ మినహాయింపు కాకుండా జనాభా వివరాల నమోదు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి మొదటి ఐదు రోజుల్లో తుది పరిశీలన చేపడతారు.

 

#Census2027 #TelanganaCensus #CensusSecondPhase #SelfEnumeration #January10 #HouseToHouseSurvey #PopulationCensus #CensusSchedule #TelanganaGovernment #CensusOfIndia #TelanganaNews