Home AP వ్యక్తిగత వ్యాఖ్యలపై నేతలకు టీడీపీ వార్నింగ్

వ్యక్తిగత వ్యాఖ్యలపై నేతలకు టీడీపీ వార్నింగ్

రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని తెలుగుదేశం పార్టీ టీడీపీ స్పష్టం చేసింది. కూటమి పార్టీల నేతలు, వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు ఏ రాజకీయ పక్షానికి చెందిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం, బహిరంగ చర్చలకు దిగడం ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని పేర్కొంది. ప్రజా వేదికల్లో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ సంయమనం, బాధ్యత పాటించాలని సూచించింది.

ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు

ఐటీడీపీకి సంబంధించిన సోషల్‌ మీడియా ఖాతాలు, కార్యకర్తలు ఎవరైనా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, ఇతరులపై చేసే అవమానకర వ్యాఖ్యలతో ఐటీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. గౌరవం, సంయమనం, బాధ్యత అనే మూడు సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చింది. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి అంశాలపైనే చర్చ జరగాలని పేర్కొంది. ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని ఐటీడీపీ తన ప్రకటనలో వెల్లడించింది.

 

#TDP #TeluguDesamParty #ITDP #TDPWarning #TDPLeaders #SocialMediaGuidelines #DisciplinaryAction #PersonalComments #PoliticalDecorum #PoliticalPrivacy #AndhraPradeshPolitics #APPoliticalNews