విశాఖలో కడప రాజ్యం…!?
విశాఖ సాగర తీరంలో ఇప్పుడు రాజకీయ అలలు ఎగసిపడుతున్నాయి..! అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దృష్టి విశాఖ మేయర్ పీఠంపైనా? అన్న ప్రచారం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో వేడి పెంచుతోంది. మేయర్ అభ్యర్థిపై కూటమి నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. బీసీ మహిళకు రిజర్వేషన్ వస్తే సీఎం రమేష్ సతీమణి శ్రీదేవిని బరిలోకి దింపే ఆలోచన ఉందన్న చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఓ ప్రచారమా..? లేక విశాఖ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతమా? ప్రొద్దుటూరు నుంచి మొదలైన సీఎం రమేష్ రాజకీయ ప్రయాణం.. రాజ్యసభ మీదుగా అనకాపల్లి పార్లమెంటు పీఠానికి చేరింది. ఇప్పుడు అదే రాజకీయ అడుగు విశాఖ వైపు మళ్లుతోందా? 2025లో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానాలు 74 మంది మద్దతుతో నెగ్గడం.. విశాఖ రాజకీయాల్లో సీఎం రమేష్ పాత్రపై చర్చకు దారితీసింది. ఇప్పుడు కుటుంబం నుంచి శ్రీదేవి పేరు వినిపించడంతో ఆ చర్చకు మరింత పదును వచ్చింది. కడప మూలాలు.. అనకాపల్లి పట్టు.. వైజాగ్‌పై ఫోకస్..! అసలు వెనుక ఉన్న రాజకీయ లెక్కేంటి?
#CMRamesh #Sridevi #VisakhapatnamMayor #GVMC #GVMC2026 #MayorRace #VisakhapatnamPolitics #AnakapalliMP #BJP #TDP #JanaSena #BCReservation #GVMC2026Elections #AndhraPradeshPolitics #VizagPolitics











