Home National_news లోక్‌సభ సీట్లు పెంచొద్దు డీలిమిటేషన్ అక్కర్లేదు

లోక్‌సభ సీట్లు పెంచొద్దు డీలిమిటేషన్ అక్కర్లేదు


543 సీట్లు కొనసాగిస్తే చాలు.
రాష్ట్రాల హక్కులు కాపాడాలన్న విజయ్.

తమిళనాడు సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ డీలిమిటేషన్‌ అంశంపై కీలక అడుగు వేయనున్నారు. ప్రస్తుత లోక్‌సభ బలాన్ని 543 సీట్లకే శాశ్వతంగా కొనసాగించాలని, రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల పంపిణీని మార్చొద్దని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా తమ హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ తీర్మానం ఉండనుంది. ఆగస్టు 8న చెన్నైలో తమిళనాడు ఎంపీలతో విజయ్‌ సమావేశం నిర్వహించి ఇదే అంశంపై చర్చించారు. రాష్ట్రానికి చెందిన 57 మంది ఎంపీల్లో 39 మంది లోక్‌సభ, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే సమావేశానికి 19 మంది మాత్రమే హాజరయ్యారు. అయినా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

మహిళా రిజర్వేషన్‌.. అదే సీట్లతో

డీలిమిటేషన్‌ ద్వారా జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు పెంచితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన ఉంది. అందుకే ప్రస్తుత సీట్ల పంపిణీని కొనసాగించాలని తమిళనాడు కోరుతోంది. లోక్‌సభ–రాజ్యసభ సీట్ల నిష్పత్తిని కూడా ప్రస్తుత 2.2:1గా కొనసాగించాలని తీర్మానంలో కోరే అవకాశం ఉంది. మరోవైపు 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను ఆలస్యం లేకుండా అమలు చేయాలని విజయ్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేయనుంది. 543 సీట్ల ప్రాతిపదికనే మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలన్నది తమిళనాడు వైఖరి.

 

#TVKVijay #TamilNaduPolitics #Delimitation #LokSabhaSeats #543Seats #TamilNadu #SouthIndia #StateRights #Parliament #LokSabha #WomensReservation #TamilNaduAssembly #IndianPolitics #DelimitationDebate