బాబు లక్ష్యంగా కలిసిన హ్యాండ్స్.
వైకుంఠపాళిలో జగన్‌కు కనిపించిందా దారి..
కేసీఆర్‌కు పాలిటిక్స్ లో బోధపడిందా రాజనీతి.
2019లో ఒకే రాజకీయ గీతపై అడుగులు.. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రలో జగన్.. ఇద్దరి ముందూ ఒకే లక్ష్యం…చంద్రబాబు రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టడం. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం కేవలం ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలకే పరిమితం కాలేదు. రెండు ప్రాంతీయ శక్తులు కలిసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనకూ అది బాటలు వేసింది. కానీ రాజకీయాల వైకుంఠపాళిలో నిచ్చెనలు ఎప్పుడూ పైకే తీసుకెళ్లవు.. కొన్ని పాములు ఒక్కసారిగా కిందికి లాగేస్తాయి. కేసీఆర్ తెలంగాణలో అధికారం కోల్పోయారు. జగన్ ఆంధ్రలో 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయారు. మరోవైపు 2019లో రాజకీయంగా దెబ్బతిన్న చంద్రబాబు 2024లో మళ్లీ అధికార పీఠాన్ని అందుకున్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మరో రాజకీయ మలుపు. మరి 2019లో కలిసి వేసిన ఎత్తులు ఎక్కడ తప్పాయి? అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్, జగన్ ఎంచుకున్న దారులు ఎందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి? 2029 నాటికి ఈ ఇద్దరూ మళ్లీ తమ పార్టీలను ప్రధాన పోటీదారులుగా నిలబెట్టగలరా? అసలు వైకుంఠపాళిలో పైకి తీసుకెళ్లే నిచ్చెన ఏది.. కిందికి లాగే పాము ఏది?
#KCR #Jagan #Chandrababu #KCRJagan #BRS #YSRCP #TDP #TelanganaPolitics #AndhraPradeshPolitics #APPolitics #PoliticalStrategy #2029Politics #RegionalParties #IndianPolitics











