పెళ్లికి ఇంకా టైముందన్న జాన్వీ కపూర్ .
శిఖర్‌తో బంధంపై జాన్వీ ఓపెన్ టాక్..
పెళ్లికి మరో రెండుమూడేళ్ల సమయం!
ప్రేమలో ఎన్నో మలుపులు.. మనసులు మాత్రం ఒక్కటే! బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన ప్రేమకథపై ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. వ్యాపారవేత్త శిఖర్ పహారియాతో తన అనుబంధం గురించి ‘కాఫీ విత్ కరణ్ 9’ కార్యక్రమంలో మనసు విప్పిన ఈ అందాల తార.. తమ పెళ్లికి మాత్రం ఇప్పట్లో ముహూర్తం లేదని స్పష్టం చేసింది. మరో రెండుమూడేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పి అభిమానులకు అసలు విషయం తేల్చేసింది. తన వ్యక్తిగత జీవితానికి అనవసరమైన ప్రచారం వద్దనుకుంటూనే ప్రేమను రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రతి విషయాన్ని దాచిపెడుతూ అడుగడుగునా జాగ్రత్తపడటం బోరింగ్‌గా ఉంటుందని చెప్పింది. గతంలో ఇతరులతో విడిపోయిన సందర్భాల్లోనూ తామిద్దరం ఒకరికొకరు అండగా నిలిచామని వెల్లడించింది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ ప్రస్తావించిన ఓ సంఘటన వారి బంధంలోని భావోద్వేగాన్ని బయటపెట్టింది. జాన్వీ తల్లి, దివంగత నటి శ్రీదేవి మరణించిన సమయంలో లండన్‌లో ఉన్న శిఖర్.. తమ మధ్య ప్రేమ సంబంధం లేని రోజుల్లోనే చదువుకు విరామం ఇచ్చి ముంబైకి వచ్చాడట. జాన్వీకి అవసరమైతే తోడుగా ఉండాలనే ఉద్దేశంతో జుహూలో స్నేహితుడి ఇంట్లో నెలరోజులు ఉన్నాడని ఆమె గుర్తుచేసుకుంది. రోజూ కలవకపోయినా, అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలనుకున్న అతడి మనసును తాను తర్వాత తెలుసుకున్నానని చెప్పింది. ఎన్నో ఏళ్ల పరిచయం, మధ్యలో ఎడబాట్లు, మళ్లీ కలయికలతో సాగిన ఈ ప్రేమకథ ఇప్పుడు పెళ్లి చర్చలతో మరోసారి వార్తల్లో నిలిచింది. పెళ్లికి ఇంకా సమయం ఉన్నా.. జాన్వీ, శిఖర్ ప్రేమబంధంపై అభిమానుల్లో మాత్రం ఆసక్తి తగ్గడం లేదు!
#JanhviKapoor #ShikharPahariya #JanhviKapoorRelationship #KaranJohar #KoffeeWithKaran #BollywoodNews #BollywoodCouple #MarriagePlans #CelebrityNews #Sridevi











