పాత కమిటీలకు పవన్ కళ్యాణ్ చెక్
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సంస్థాగతంగా సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణలో పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సమన్వయం, పర్యవేక్షణకు త్వరలో నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతంలో నియమించిన సమన్వయకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీలు ఇకపై కొనసాగవు. వాటికి అనుబంధంగా పనిచేసిన సపోర్ట్ టీమ్స్ కూడా చెల్లుబాటులో ఉండవని పార్టీ స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నిర్మాణాన్ని కొత్తగా పునర్వ్యవస్థీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
25 మంది సభ్యుల కమిటీల రద్దు
గతంలో ఏర్పాటు చేసిన 25 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలను కూడా రద్దు చేశారు. అయితే ఇటీవల రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన అయిదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ కొనసాగుతుంది. అలాగే ప్రచార కమిటీలు కూడా యథావిధిగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. కొత్త పార్లమెంట్ నియోజకవర్గాలవారీ కమిటీల నియామకంతో స్థానిక ఎన్నికల సమన్వయం మరింత కేంద్రీకృతంగా నిర్వహించే అవకాశం ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ వివరాలను వెల్లడించింది.
#JanaSena #PawanKalyan #APLocalElections #LocalBodyElections #AndhraPradesh #JanaSenaParty #JanaSenaCommittees #PawanKalyanNews #APPolitics #ElectionPreparations #PartyRestructuring #ParliamentaryConstituencies #LocalPolls #JanaSenaNews #AndhraPradeshPolitics











