Home AP ఐకేఎఫ్ విజయగర్జన! ఐదు జాతీయ అవార్డులతో జయకేతనం

ఐకేఎఫ్ విజయగర్జన! ఐదు జాతీయ అవార్డులతో జయకేతనం

ఆర్థిక బలం.. ఉద్యోగుల ప్రతిభ, రిస్క్ విభాగాల్లో సత్తా.
ఆర్థిక రంగంలో జాతీయ స్థాయిలో సంస్థకు గుర్తింపు.

ఒక సంస్థ ఎదగడం గొప్ప కాదు.. తనతో పాటు వేలాది మంది కలలను ముందుకు నడిపించడం అసలైన విజయం! విజయవాడలో 1991లో చిన్న అడుగులతో మొదలైన ఐకేఎఫ్ ఫైనాన్స్ ప్రస్థానం.. నేడు 12 రాష్ట్రాలు, 220 శాఖలు, లక్షకు పైగా రుణగ్రహీతలకు చేరిన జాతీయ ప్రయాణంగా రూపాంతరం చెందింది. ఆర్థిక బలం, ఉద్యోగుల ప్రతిభ, పటిష్ఠమైన రిస్క్ నియంత్రణ.. ఈ మూడు ఆయుధాలతో జాతీయ వేదికపై ఐదు పురస్కారాలను కైవసం చేసుకుంది. రూ.749 కోట్లకు పైగా ఈక్విటీ సమీకరణ.. రూ.6,718 కోట్ల ఆస్తుల నిర్వహణ.. లాభాల్లో 52.7 శాతం వృద్ధి.. ఇవి కేవలం గణాంకాలు కావు.. సంస్థ సాధించిన విశ్వాసానికి ప్రతిబింబాలు! అయితే ఐకేఎఫ్ విజయ రహస్యం ఆర్థిక లెక్కల్లోనే లేదు. చిన్న వాహనం కోసం రుణం తీసుకున్న డ్రైవర్‌ను రేపటి వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉంది. కొత్త రుణం అందించడం కాదు.. కస్టమర్ జీవితంలో కొత్త ఎదుగుదలకు బాటలు వేయడమే లక్ష్యంగా సాగుతోంది. వసుమతి దేవి నాయకత్వంలో ఈ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? ఉద్యోగుల కృషి, సాంకేతికత, వినూత్న వ్యూహాలు ఐదు జాతీయ అవార్డుల వెనుక ఎలా నిలిచాయి? ఐకేఎఫ్ విజయగాథలోని అసలు సూత్రం ఏమిటి?

 

#IKFFinance #NationalAwards #VasumathiDevi #FinancialExcellence #EmployeeExcellence #RiskManagement #FinancialGrowth #VehicleFinance #Vijayawada #IndianFinance