Home AP నువ్వో.. నేనో…! రోడ్లపైనే తేల్చుకుందాం..!

నువ్వో.. నేనో…! రోడ్లపైనే తేల్చుకుందాం..!

జగన్‌ పాదయాత్రకు.. లోకేశ్‌ ఛాలెంజ్!
యువగళం కాదు.. జనబలం పేరుతో యాత్ర
లోకం చుట్టనున్న జననేత, యువనేత..?
వచ్చే రెండేళ్లు ఏపీలో పాదయాత్రల జాతర

ఏపీలో ఇప్పటివరకు రాజకీయ పోరు సభల్లో, అసెంబ్లీలో, సోషల్ మీడియాలో కనిపించింది. ఇకపై రోడ్ల మీదే అసలు యుద్ధం మొదలుకాబోతోందా? ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే జగన్‌ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం.. దానికి కౌంటర్‌గా లోకేశ్‌ కూడా భారీ ప్రజా యాత్రకు రెడీ అవుతున్నారన్న చర్చ.. ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా పీక్‌కు తీసుకెళ్తోంది. ఒకరు 2019 విజయాన్ని తెచ్చిన పాదయాత్ర సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించాలని చూస్తే.. మరొకరు 2024 విజయాన్ని 2029లోనూ కొనసాగించేందుకు జనంలోకి దిగే వ్యూహం రచిస్తున్నారా? జగన్‌ 3,648 కిలోమీటర్ల పాదయాత్రను మించి 5 వేల కిలోమీటర్ల లక్ష్యంతో కదులుతారన్న అంచనాలు వినిపిస్తుండగా.. లోకేశ్‌ గతంలోని యువగళం అనుభవాన్ని కొత్త రాజకీయ బ్రాండ్‌తో మళ్లీ ప్రజల ముందుకు తీసుకురావచ్చన్న చర్చ సాగుతోంది. జగన్‌ అడిగే ప్రశ్నలకు లోకేశ్‌ అక్కడికక్కడే సమాధానం చెప్పే పరిస్థితి వస్తే.. వచ్చే రెండేళ్లు ఏపీలో అసలు రాజకీయ వేదిక అసెంబ్లీ కాదు.. రోడ్డే! ఇది యాత్రల పోటీ కాదు.. 2029లో ఎవరి పాదముద్ర ప్రజల మనసుల్లో నిలుస్తుందో తేల్చే ముందస్తు రాజకీయ సమరం!

 

#JaganMohanReddy #NaraLokesh #JaganVsLokesh #JaganPadayatra #LokeshPadayatra #AndhraPradeshPolitics #JanabalamYatra #Yuvagalam #2029APElections #YSRCP #TDP #APPolitics #PoliticalYatra