Home Telangana ఓటరు జాబితాలో పేరు ఉందా? చెక్ చేసుకోండి.. ఓటు మీ హక్కు

ఓటరు జాబితాలో పేరు ఉందా? చెక్ చేసుకోండి.. ఓటు మీ హక్కు


కాపాడుకోండి.. డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల

తెలంగాణలో సర్-2026 ప్రక్రియలో కీలక దశ పూర్తైంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు జరిగిన ఎన్యూమరేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ దశలో ఓటర్ల నుంచి 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించినట్లు వెల్లడించారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 78.30 శాతంగా ఉంది. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని వారు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల వివరాలను కూడా అధికారులు పరిశీలించారు.

పేరు ఉందో లేదో చూసుకోండి

ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. దీంతో ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను జాబితాలో ఒకసారి పరిశీలించుకోవడం కీలకం. పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా నిర్ణీత గడువులో అభ్యంతరం లేదా సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వివరాలు వివరించారు. ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారి సూచనలను పరిశీలిస్తామని సీఈవో తెలిపారు.

ఒక్క ఓటరూ మిస్ కాకూడదు

ముసాయిదా ఓటర్ల జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు హార్డ్‌డిస్క్‌ల ద్వారా అందజేశారు. జాబితా పరిశీలనతో పాటు క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియలో పార్టీలు చురుగ్గా పాల్గొనాలని సీఈవో కోరారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడటమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన హక్కు కావడంతో ప్రతి పౌరుడు నిర్లక్ష్యం చేయకుండా జాబితాను పరిశీలించాలి. పేరు లేకపోతే లేదా వివరాల్లో పొరపాటు కనిపిస్తే గడువు ముగిసేలోపు సంబంధిత అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలి. సెప్టెంబర్ 16లోపు స్పందిస్తేనే మీ ఓటు హక్కు భద్రంగా ఉంటుంది.

 

#TelanganaVoterList #SIR2026 #TelanganaSIR #DraftVoterList #VoterList #ElectoralRoll #TelanganaElections #CEOTelangana #VoterVerification #VoterRights #VoterEnumeration #ClaimsAndObjections #SudarsanReddy #TelanganaNews #ElectionNews