Home Telangana పొంగులేటి.. తప్పు ఉంటే చర్యలేవి?

పొంగులేటి.. తప్పు ఉంటే చర్యలేవి?

భూములపై హరీశ్‌రావు ఎదురుదాడి.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేస్తున్న భూముల ఆరోపణలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. 1995లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఓ వ్యక్తి భూమి కొనుగోలు చేశారని, 2010లో అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ భూమికి ఎన్‌ఓసీ ఇచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తన మామ ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.15 కోట్లు అని పొంగులేటి చెబుతున్నారని, రూ.50 లక్షలు ఇచ్చి ఆ భూమిని పొంగులేటే తీసుకోవచ్చని సవాల్‌ చేశారు. మిషన్‌ భగీరథలో తమ కుటుంబ సభ్యుల భూమి పోయిందని, దానికి ప్రభుత్వం పరిహారం ఇచ్చిందన్న పొంగులేటి వ్యాఖ్యలపైనా హరీశ్‌రావు స్పందించారు. ఆ భూమి ‘గోదావరి సృజల స్రవంతి’ కార్యక్రమంలో పోయిందని, అదీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. పొంగులేటి, రేవంత్‌ ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్‌లు, పొంగులేటి కుమారుడి భూ వ్యవహారాలను బయటపెడుతున్నందుకే తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. “ఇప్పుడు అధికారంలో ఉన్నది నువ్వే.. తప్పు జరిగితే చర్యలు తీసుకో” అంటూ పొంగులేటికి హరీశ్‌రావు సూటి సవాల్‌ విసిరారు.

22Aపై సమాధానం ఎక్కడ పొంగులేటి?

22A అంశంపై బీఆర్ఎస్‌ లేవనెత్తిన ఒక్క ఆరోపణకు కూడా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇవ్వలేదని హరీశ్‌రావు విమర్శించారు. 2025 డిసెంబర్‌లో ప్రభుత్వం అప్‌లోడ్‌ చేసిన ఓ జాబితా కారణంగానే ఈ తప్పిదం జరిగిందని అసెంబ్లీ సాక్షిగా పొంగులేటి స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెబుతుందని, 22A కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ఎప్పుడు తొలగిస్తారో స్పష్టత ఇస్తారని తాము ఆశించామని చెప్పారు. అయితే ఇప్పటివరకు కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదని మండిపడ్డారు. భూములపై ఆరోపణలు చేయడం కంటే 22A సమస్యకు పరిష్కారం చూపాలని, తప్పిదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ అసలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

 

#HarishRao #PonguletiSrinivasReddy #Ponguleti #22ALands #22ALandIssue #TelanganaLandIssue #HarishRaoComments #PonguletiComments #LandDispute #BRS #RevanthReddy #TelanganaPolitics #TelanganaGovernment #22AProhibitedLands #LandAllegations #TelanganaLandRow #BRSNews #PoliticalNews #TelanganaNews #HarishRaoVsPonguleti