92 లక్షల మందికి నోటీసులు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 65 లక్షల మంది నోటీసులకు స్పందించారని చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 80 వేల మందికి నోటీసులు ఇవ్వగా, సుమారు 20 శాతం మంది స్పందించినట్లు వెల్లడించారు. నోటీసులు అందుకున్న వారి ఇళ్లకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తున్నారని తెలిపారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని, ఒక్క కుటుంబ సభ్యుడు అందుబాటులో ఉండి మిగతా సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.
సర్లో కొన్ని మార్పులు
సర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ కొన్ని మార్పులు చేసినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటర్ల నుంచి అవసరమైన వివరాలు, పత్రాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. నోటీసులు అందుకున్న కుటుంబాలు నిర్ణీత ప్రక్రియ ప్రకారం స్పందించాలని సూచించారు. సర్ గడువును మరోసారి పొడిగించే ఆలోచన లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన వెల్లడించారు.
#TelanganaSIR #SIR #VoterList #VoterListRevision #TelanganaElections #SudarshanReddy #ElectionCommission #BLO #Khairatabad #VoterVerification #ElectoralRoll #TelanganaPolitics











