తెలంగాణ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెరపైకి వచ్చాయి! హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కసారిగా సుప్రీంకోర్టు గడప ఎందుకు తొక్కాల్సి వచ్చింది? నిన్నటి వరకు “ఎన్నికలు వస్తే ఎదుర్కొంటా.. గెలిచి తీరుతా” అన్న నాయకుడు.. మరుసటి రోజే న్యాయపోరాటానికి ఎందుకు దిగారు? ఉపఎన్నిక వస్తే నిజంగానే దానం నాగేందర్‌కు రాజకీయంగా గట్టి సవాలేనా? ఖైరతాబాద్‌లో గెలుపుపై ఆయనకు పూర్తి ధీమా లేదా? లేక ఎమ్మెల్యే పదవి మాత్రమే కాదు.. తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టారా? దానం రాజకీయ ప్రయాణాన్ని వెనక్కి తిప్పి చూస్తే పార్టీలు మారిన ప్రతిసారీ అధికార సమీకరణాలకు అనుగుణంగా ఆయన అడుగులు మారిన తీరు కనిపిస్తుంది. టీడీపీ నుంచి కాంగ్రెస్.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్.. మళ్లీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్.. ఇప్పుడు అదే రాజకీయ ప్రయాణం ఆయనను మరో కీలక మలుపు వద్ద నిలిపిందా? స్పీకర్ నిర్ణయం, హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో కేవియట్లు.. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక.. బీఆర్ఎస్ ప్రతిదాడి.. బీజేపీ వ్యూహం.. పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేరు.. చింతల రామచంద్రారెడ్డి చర్చ.. వీటన్నింటి మధ్య కొత్త తరానికి చెందిన జెన్‌జీ నాయకుడు బరిలోకి వస్తే లెక్కలు మారుతాయా? అసలు దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక అసలు రాజకీయ లెక్కేంటి? ఖైరతాబాద్‌లో జరగబోయేది ఉపఎన్నికేనా.. లేక తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద మలుపా?
#DanamNagender #Khairatabad #KhairatabadBypoll #SupremeCourt #DanamDisqualification #TelanganaHighCourt #BRS #BJP #Congress #VishnuvardhanReddy #ChintalaRamachandraReddy #TelanganaPolitics #ByElection #PoliticalStrategy #TelanganaNews











