Home Telangana దానం అనర్హతతో నో ప్రాబ్లమ్

దానం అనర్హతతో నో ప్రాబ్లమ్

ఫిరాయింపుల పాపం కేసీఆర్‌దే.
మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టీకరణ.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టు తీర్పును కాంగ్రెస్‌ స్వాగతిస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బగా అభివర్ణించారు. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందన్నారు. అయితే దానం నాగేందర్‌నే మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దింపుతారా అనే అంశంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

కేసీఆర్‌పైనే పార్టీ మార్పుల ఆరోపణ

దానం నాగేందర్‌ అనర్హత తీర్పు బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతిని కేసీఆర్‌ తీసుకొచ్చారని ఆరోపించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మంత్రులను చేశారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వాలను పడగొట్టి, పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ దెబ్బతీస్తోందని ఆరోపించారు.

 

#DanamNagender #MaheshKumarGoud #TelanganaCongress #Khairatabad #KhairatabadBypoll #TelanganaHighCourt #DanamDisqualification #Congress #BRS #KCR #AntiDefectionLaw #DefectionPolitics #TelanganaPolitics #TelanganaByElection #TelanganaNews