మండలాల్లో 19న.. జిల్లాల్లో 20న.
ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల .
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 19న మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు, 20న జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 659 మండల పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 28 జిల్లా పరిషత్‌లలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను చేతులెత్తే పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తాజాగా పరోక్ష ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది.
జడ్పీటీసీల్లో కూటమికి భారీ ఆధిక్యం
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన 582 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 499 స్థానాలు (85.73 శాతం) గెలుచుకుంది. వైఎస్సార్సీపీకి 76 స్థానాలు (13.05 శాతం) దక్కాయి. కూటమి పార్టీల్లో టీడీపీ 407, జనసేన 72, బీజేపీ 20 స్థానాలు సాధించాయి. ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలతో కలిపి కూటమి మొత్తం 7,799 స్థానాలు దక్కించుకుంది. ఇందులో టీడీపీ 6,585, జనసేన 1,044, బీజేపీ 170 స్థానాలు గెలుచుకున్నాయి. వైఎస్సార్సీపీ 1,801 స్థానాలు గెలుచుకుంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 195 స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ పీఠాల ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
#APMPPElections, #ZPElections, #AndhraPradesh, #SECNotification, #ElectionSchedule, #MPPChairperson, #ZPChairperson, #LocalBodyElections, #ZPTCResults, #MPTCResults, #TDP, #Janasena, #BJP, #YSRCP, #AndhraPolitics











