Home General ఎవరెస్ట్ ఎక్కిన రోబోటిక్ సర్జన్

ఎవరెస్ట్ ఎక్కిన రోబోటిక్ సర్జన్

6

డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది సరికొత్త రికార్డు. ఏడు ఖండాలపై విజయ పతాకం

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైన మౌంట్ డెనాలి శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘సెవెన్ సమ్మిట్స్’ సవాల్‌ను పూర్తి చేశారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తొలి దక్షిణ భారతీయ వైద్యుడిగా చరిత్ర సృష్టించారు. గతంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్‌తో పాటు అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ శిఖరాలను కూడా అధిరోహించి తన సాహసోపేతమైన ప్రతిభను చాటుకున్నారు.

కరోనా నుంచి కోలుకుని శిఖరాగ్రానికి

కోవిడ్ మహమ్మారి సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కోలుకుని పర్వతారోహణ రంగంలో అడుగుపెట్టారు. బూట్స్ అండ్ క్రాంపాన్ వ్యవస్థాపకుడు భరత్ తమ్మినేని ప్రోత్సాహంతో ఈ సాహస యాత్రను ప్రారంభించి ప్రపంచ శిఖరాలను జయించారు. హిప్, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో నిపుణుడైన ఆయన రోబోటిక్ సర్జరీల ద్వారా వేలాది మంది రోగులకు నూతన జీవితం అందిస్తున్నారు.

విజయం వెనుక కుటుంబం, మంజు హాస్పిటల్ ప్రోత్సాహం

డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విజయాల వెనుక ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య, తల్లిదండ్రుల అండదండలు కీలక పాత్ర పోషించాయి. అలాగే మంజు హాస్పిటల్ యాజమాన్యం అందించిన నిరంతర ప్రోత్సాహం, సహకారం ఆయన లక్ష్య సాధనలో ఎంతో తోడ్పడింది. వైద్య సేవల్లో రోగుల పట్ల అపారమైన శ్రద్ధ, రోబోటిక్ శస్త్రచికిత్సల్లో విశేష నైపుణ్యం, మరోవైపు ప్రపంచ శిఖరాలను జయించే సాహస స్పూర్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని ఎందరికో ఆదర్శంగా నిలిపాయి.

 

#DrRajashekarReddyKandi #SevenSummits #MountDenali #MountEverest #MountVinson #MountainClimbing #Mountaineering #WorldRecord #SouthIndia #OrthopedicSurgeon #RoboticSurgeon #Hyderabad #Inspiration #Adventure #Achievement #MedicalProfessional #SevenContinents #SummitChallenge #DenaliExpedition #IndianMountaineer #CovidSurvivor #SuccessStory #ManjuHospital #BharathTammineni #Leadership #Motivation #HyderabadNews #TelanganaNews #BreakingNews #PrideOfIndia