Home AP 34 శాతం బీసీ రిజర్వేషన్లే లక్ష్యం

34 శాతం బీసీ రిజర్వేషన్లే లక్ష్యం

ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమన్న లోకేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బీసీల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం తీర్పు వెలువడిన తర్వాతే ఎన్నికల ప్రక్రియపై ముందడుగు వేస్తామని చెప్పారు. మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో లోకేశ్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని లోకేశ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి శుక్రవారం కీలక నిర్ణయం రావచ్చని ఆశిస్తున్నామని చెప్పారు. తీర్పు అనుకూలంగా వస్తే అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించడంపై లోకేశ్ విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల రొటేషన్ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాతే కార్పొరేషన్ చైర్మన్లు తదితర నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారిస్తామని లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. న్యాయస్థానం నిర్ణయం తర్వాతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తదుపరి అడుగులు పడనున్నాయి. దీంతో ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారింది.

 

#NaraLokesh #BCReservations #34PercentReservations #AndhraPradesh #LocalBodyElections #SupremeCourt #TDP #BCWelfare #APPolitics #OBCReservations #AndhraPradeshNews