Home National_news సర్ పెట్టిన చిచ్చు

సర్ పెట్టిన చిచ్చు

మోడీ సర్కారు మెడకు ఉచ్చు.
లోక్‌సభ, అసెంబ్లీల రద్దుకు కాంగ్రెస్ డిమాండ్.
నిరసనలతో దేశమంతటా రీసౌండ్.

ఎన్నికల చుట్టూ మంటలు.. ఓటు చుట్టూ రగడ.. ఈసీపై ప్రశ్నలు.. న్యాయస్థానాల్లో విచారణలు.. దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపులు.. ఇలా ఒక్కో పరిణామం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఎన్నికల వ్యవస్థపైనే సంచలన ఆరోపణలు చేస్తూ.. లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్లతో పోలింగ్‌ జరపాలని పట్టుబడుతున్నారు. మరోవైపు ఓటర్ల జాబితాల సవరణ కోసం చేపట్టిన సర్‌ ప్రక్రియపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఎవరి ఓట్లు తొలగుతున్నాయి..? ఎందుకు తొలగుతున్నాయి..? జాబితా నుంచి పేరు మాయమైతే అర్హుడైన ఓటరు తిరిగి తన హక్కును ఎలా పొందాలి..? అన్న ప్రశ్నలు రాజకీయ రణరంగాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇదే సమయంలో ఈసీ పనితీరు.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారశైలిపై వచ్చిన ప్రశ్నలు న్యాయస్థానాల గడప దాటాయి. ఒకవైపు అక్టోబర్‌ 6న ప్రతిపక్షాల మార్చ్‌.. మరోవైపు అక్టోబర్‌ 10న సీఈసీ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ జంతర్‌ మంతర్‌ సమరం.. ఎన్నికల వ్యవస్థపై చర్చను దేశవ్యాప్త అంశంగా మారుస్తున్నాయి. ఆరోపణలు ఎక్కడి వరకు నిజం..? సర్‌ అసలు వివాదం ఏమిటి..? ఈసీపై ప్రశ్నలు ఎందుకు పెరుగుతున్నాయి..? అక్టోబర్‌ 6, 10న ఏం జరగబోతోంది..? చివరికి ప్రజల ఓటు.. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఈ పోరాటంలో ఎటు నిలుస్తాయి..?

 

#SIR #SpecialIntensiveRevision #MallikarjunKharge #ElectionCommission #GyaneshKumar #VoterList #ElectoralRoll #BallotPaper #EVM #INDIABloc #October6Protest #October10Protest #CJP #VoterRights #IndianPolitics