సర్కు ముందు ఓటర్ల లిస్టే కావాలన్న ఖర్గే
ఈసీపై ఆరోపణలు.. ప్రతిపక్షాల ఐక్యతకు పరీక్ష
ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ.. బయటకు సాధారణ రాజకీయ సమావేశంలా కనిపించినా, లోపల మాత్రం దేశ రాజకీయాలకు కొత్త దిశను నిర్ణయించే వ్యూహరచన సాగింది. ఎన్నికల సంఘం, సర్, ఓటర్ల జాబితా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా.. ఇవే ఇప్పుడు ప్రతిపక్షాల పోరాటానికి కేంద్రబిందువులుగా మారాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గళం విప్పారు.. రాహుల్ గాంధీ ఆరోపణలకు మరింత రాజకీయ బలం చేకూర్చే ప్రయత్నం జరిగింది.. మమతా బెనర్జీ హాజరుతో సమావేశానికి ప్రాధాన్యం పెరిగింది. కానీ అసలు ప్రశ్న మాత్రం అక్కడే ఉంది.. ఇండియా కూటమి మొత్తం ఒకే గొంతుతో పోరాడుతుందా? డీఎంకే, ఆప్ దూరంగా ఉండటం.. అఖిలేష్ ప్రతినిధులను పంపడం.. కూటమి ఐక్యతపై కొత్త సందేహాలకు తెరదీశాయి. మరోవైపు సర్పై ఎన్నికల కమిషనర్ల మధ్యే అభ్యంతరాలు నమోదయ్యాయన్న నివేదికలు ప్రతిపక్షాలకు కొత్త ఆయుధంగా మారాయి. సీఈసీ తొలగింపు నుంచి బ్యాలెట్ ఓటింగ్ వరకు… వీధి పోరాటం నుంచి పార్లమెంటరీ వ్యూహం వరకు.. ఇండియా కూటమి భారీ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఆరోపణలు ప్రజల్లో ఎంత ప్రభావం చూపుతాయి? మిత్రపక్షాలు చివరి వరకు కలిసే ఉంటాయా? కాంగ్రెస్ వ్యూహం దేశ రాజకీయాలను ఎంతవరకు కదిలిస్తుంది? అసలు ముందున్నది ఏంటి?
#INDIABloc #MallikarjunKharge #SIR #VoterList #PreSIRRolls #GyaneshKumar #CEC #ElectionCommission #ECI #OppositionUnity #MamataBanerjee #RahulGandhi #ElectionReforms #BallotVoting #IndianPolitics











