కేటీఆర్‌ను టార్గెట్ చేస్తోన్న కాంగ్రెస్.
యాజమాన్యంపై మళ్లీ రగిలిన రగడ.
లీజు కథలో అసలు మలుపేంటి?
జన్వాడ ఫామ్‌హౌస్.. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రగులుతున్న రగడ. ఫామ్‌హౌస్ ఎవరిది? కేటీఆర్ నిజంగానే స్నేహితుడి నుంచి లీజుకు తీసుకున్నారా? అయితే ఆ లీజు వెనుక ఉన్న లెక్కేంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రదీప్‌రెడ్డి తానే భూమి యజమానినని, 2019లో నాలుగు ఎకరాలు కొనుగోలు చేసి కేటీఆర్‌కు లీజుకు ఇచ్చానని చెప్పడం కొత్త మలుపు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం యాజమాన్యంపై పాత ఆరోపణలను మళ్లీ తెరపైకి తెస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ శాఖల సర్వేలో బల్కాపూర్ నాలా భూమి, బఫర్ జోన్ ఆక్రమణకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడం వివాదాన్ని మరింత పెంచింది. ఒకప్పుడు ఇదే ఫామ్‌హౌస్‌పై ఆరోపణలు చేస్తూ వెళ్లిన రేవంత్‌రెడ్డి అరెస్టు కావడం, డ్రోన్ వివాదం, ఎన్‌జీటీ విచారణ వరకు వెళ్లిన వ్యవహారం ఇప్పుడు మళ్లీ రాజకీయ చర్చగా మారింది. తాజాగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటన.. హైడ్రాకు ఫిర్యాదుతో వ్యవహారం మరింత పదునెక్కింది. లీజు పత్రాలు ఏం చెబుతున్నాయి? భూమి రికార్డుల్లో ఎవరి పేరు ఉంది? నాలా ఆక్రమణపై అధికారుల నివేదికలో ఏముంది? కేటీఆర్ వాదనకు ప్రదీప్‌రెడ్డి ప్రకటన ఎలా బలం ఇస్తోంది? కాంగ్రెస్ ఆరోపణలకు ఆధారాలేంటి? ఈ ప్రశ్నలన్నింటి వెనుక దాగిన అసలు కథేంటి? జన్వాడ ఫామ్‌హౌస్ వివాదం ఎటు మలుపు తిరగనుంది?
#JanwadaFarmhouse #KTR #PradeepReddy #Janwada #FarmhouseRow #KTRFarmhouse #FarmhouseOwnership #LeaseAgreement #TelanganaCongress #BRS #CongressVsBRS #HYDRAA #BalkaourNala #TelanganaPolitics #LandDispute











