సిద్ధార్థ్‌కు పార్టీలోనే ప్రత్యర్థి.
“పట్టాభి”షేకం వద్దంటూ కొర్రి.
రేసులోకి రాధా రావడంతో బోండా వర్రీ.
లోకేశ్ వద్దకు వర్గ పోరు..
కొత్త పంచాయితీతో ఉమా బేజారు.
విజయవాడ మేయర్ పీఠం చుట్టూ రాజకీయ వేడి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మొదలైంది. ఒక్క కుర్చీ కోసం టీడీపీలోనే పలువురు ఆశావహుల పేర్లు తెరపైకి రావడం, బొండా సిద్ధార్థ్, కొమ్మారెడ్డి పట్టాభి, వంగవీటి రాధాకృష్ణ పేర్ల చుట్టూ సాగుతున్న చర్చలు రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే వర్గం, మరోవైపు ఎంపీ వర్గం, ఇంకోవైపు సామాజిక సమీకరణాలు.. వీటన్నింటి మధ్య జనసేన కూడా తన రాజకీయ వాటాను కోరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. బీజేపీ సైతం నగర స్థాయిలో తన ప్రాతినిధ్యంపై లెక్కలు వేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదంతా జరుగుతున్న వేళ మేయర్ పదవికి రిజర్వేషన్ ఏంటన్నది ఇంకా కీలక ప్రశ్నగానే ఉంది. రిజర్వేషన్ తేలకముందే ఆశావహులు తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 15 మందికి పైగా పేర్లు పరిశీలనలో ఉన్నట్టు కేశినేని చిన్ని పేర్కొన్నారన్న కథనాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. తుది నిర్ణయం చంద్రబాబు, లోకేశ్, పార్టీ సర్వేలు, కూటమి సమీకరణాల ఆధారంగా ఉండొచ్చన్న చర్చ నేపథ్యంలో.. అసలు పీఠం ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? ఎవరి రాజకీయ భవిష్యత్తుకు ఇది కీలక మలుపవుతుంది? ఇదే ఇప్పుడు బెజవాడలో అసలు రాజకీయ ఉత్కంఠ!
#VijayawadaMayor #VijayawadaPolitics #TDP #TDPMayorCandidate #BondaSiddharth #KommareddyPattabhi #VangaveetiRadha #NaraLokesh #ChandrababuNaidu #KesineniChinni #APPolitics #AndhraPradeshPolitics #VijayawadaMunicipalElections











