Home National_news జనం నెత్తిన యూపీఐ పన్ను ట్రంప్ ఒత్తిడికి మోదీ తలొగ్గారు

జనం నెత్తిన యూపీఐ పన్ను ట్రంప్ ఒత్తిడికి మోదీ తలొగ్గారు

చార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.
కొత్త చార్జీలపై రాహుల్ గాంధీ ఫైర్.

యూపీఐ లావాదేవీలపై కొత్తగా విధించిన వ్యాపారి రుసుముపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిడికి తలొగ్గారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. “యూపీఐపై విధించిన రుసుమును వెంటనే వెనక్కి తీసుకోవాలి” అని డిమాండ్‌ చేశారు. అమెరికా ఒత్తిడికి లొంగిపోయి భారతీయులపై ‘యూపీఐ పన్ను’ విధిస్తున్నారని విమర్శించారు. అమెరికా కంపెనీలకు ప్రయోజనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది కాంగ్రెస్‌ ప్రధాన ఆరోపణగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది వినియోగదారులపై విధించే పన్ను కాదని స్పష్టం చేసింది.

అమెరికా ఒత్తిడే కారణమా?

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కూడా యూపీఐపై శూన్య వ్యాపారి రుసుము విధానాన్ని అమెరికా గతంలో ప్రశ్నించిందని ప్రస్తావించారు. వీసా, మాస్టర్‌కార్డ్‌ వంటి కార్డు సంస్థలతో పోలిస్తే యూపీఐ ఉచితంగా ఉండటంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. 0.4 శాతం రుసుమును ఎందుకు నిర్ణయించారో, దీని వెనుక అమెరికా కార్డు సంస్థలకు పోటీ అవకాశం కల్పించే ఉద్దేశం ఉందా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అమెరికా సుంకాలు, వాణిజ్యం, వీసాలు, డిజిటల్‌ చెల్లింపుల విషయంలో భారత్‌పై ఒత్తిడి పెరుగుతోందని విమర్శించారు.

 

#RahulGandhi #UPICharges #UPIMerchantFee #UPIControversy #NarendraModi #DonaldTrump #Congress #JairamRamesh #MallikarjunKharge #DigitalPayments #UPI2026 #IndiaPolitics