Home Cinema_News ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. న్యాచురల్ స్టార్ నాని

ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. న్యాచురల్ స్టార్ నాని

సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఎప్పుడూ నా కెరీర్‌లో ఒక సినిమాకి మరో సినిమాకి ఇంత గ్యాప్ రాలేదు. ఈ ప్రెస్ మీట్‌కి వస్తూ ఉంటే నా ఫస్ట్ సినిమాకి ఎంత నెర్వస్‌గా ఉన్నానో అంతే నెర్వస్‌గా ఉన్నానని అనిపించింది. మైక్‌లో మాట్లాడడం అలవాటు తప్పింది. ఫైనల్‌గా సెప్టెంబర్ 24న వస్తున్నాం. మొదటి సినిమాకి చాలా గొప్ప సపోర్ట్ ఉంది. ఇదే సపోర్ట్ కొనసాగుతుందని నమ్ముతున్నాను. ఆయా షేర్, ఏష నాగుల కట్ట, గ్లింప్స్, టీజర్.. సినిమా నుంచి ఏ కంటెంట్ ఇచ్చినా సరే అన్నిటికీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. మీరు సినిమాని అంతగా సొంతం చేసుకున్నట్టు చూస్తుంటే మా బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఈ సినిమాకి ఒక డెస్టినీ ఉంది అనే బలమైన నమ్మకం వచ్చింది. సెప్టెంబర్ 24న ఆడియన్స్‌కి ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నాం. మా టార్గెట్ ఒకటే. మీరందరూ చాలా అంచనాలతో థియేటర్‌కి వస్తారని తెలుసు. మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక అడ్రినలిన్ పంపింగ్, హై ఇచ్చి ఇంటికి పంపించాలనేది మా తపన. మేమందరం దానికోసం కష్టపడుతున్నాం.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. సినిమా మొదలైనప్పటి నుంచి మీడియా వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా నుంచి ఏది వచ్చినా సరే ఆడియన్స్‌లో బ్లాస్ట్ అవుతుంది. సాంగ్స్, టీజర్‌ను చాలా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. నా ‘సినిమా’ అనేకంటే ‘జనం సినిమా’ అనడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అంతలా ఈ కంటెంట్‌ను ఆదరించారు. ఇది రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం. ఒక తల్లి, కొడుకుల కథ. ఒక సవారీ జాతి కథ. “పుట్టుక మనది, చావు మనది, బతుకంతా దేశానిది” అని కాళోజీ గారి మాట ఉంటుంది. ఆ దేశం కోసం కొట్లాడిన వారిని ఆ దేశంతోనే సంబంధం లేదు అంటే.. వాళ్లందరూ ఏం చేయాలో తెలియక, మరుగునపడ్డ జాతి కథ. ‘ది ప్యారడైజ్’ కథ ఏమిటో అవగాహన కోసం ఇది చెప్తున్నాను. ఇంత సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్యూ.

 

#TheParadise #TheParadiseMovie #Nani #NaturalStarNani #NaniTheParadise #TheParadiseSeptember24 #SrikanthOdela #SLVCinemas #SudhakarCherukuri #NaniPanIndia #PanIndiaMovie #NaniNewMovie #TheParadiseTeaser #TheParadiseSongs #TeluguCinema #TeluguMovies #MovieNews #NaniFans