Home AP జగన్‌కు చంద్రబాబు కౌంటర్

జగన్‌కు చంద్రబాబు కౌంటర్

డీఎస్సీ పై నిజాలు చెప్పారు.
మహిళా ఐఏఎస్‌లకు అభినందనలు.

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, శాప్‌ ఎండీ భరణిలను ప్రత్యేకంగా అభినందించారు. డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలను స్పష్టంగా వివరించారంటూ ఇద్దరు మహిళా అధికారులను సీఎం ప్రశంసించారు. డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించాం.. దాన్ని ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలపై విమర్శలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా, వాస్తవాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. డీఎస్సీ విషయంలోనూ ఇదే విధానాన్ని అవలంబించాలని చెప్పారు. నియామక ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమీమ్‌ అన్సారియా, భరణి కీలక బాధ్యతలు నిర్వర్తించారని సీఎం కొనియాడారు. మహిళా అధికారులు ముందుండి ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం జరిగినప్పుడు అధికారులు మౌనం వహించకుండా, వాస్తవాలు, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. డీఎస్సీపై కొనసాగుతున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

#ChandrababuNaidu #Chandrababu #DSC #MegaDSC #APDSC #DSCRecruitment #DSCControversy #DSCMisinformation #DSCFacts #TameemAnsariya #Bharani #SAAP #APTeacherRecruitment #TeacherJobs #APEducation #SchoolEducation #CollectorsConference #Jagan #YSJagan #APGovernment #APPolitics #AndhraPradeshPolitics #APNews