మెగాస్టార్స్ మిరాకిల్..
మెగా బ్రదర్స్.. ఇక ‘మినిస్టర్స్’ బ్రదర్స్ అవుతారా?
సినిమా తెరపై మెగా బ్రదర్స్ కనిపిస్తే అభిమానులకు పండుగే.. కానీ రాజకీయ తెరపై ముగ్గురూ ఒకే అధికార ఫ్రేమ్‌లో కనిపిస్తే? అది కేవలం సంచలనం కాదు.. రాజకీయ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం! ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా ఢిల్లీ స్థాయిలో తన ముద్ర వేశారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ పోరాటంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇద్దరు అన్నదమ్ములు ఇప్పటికే ప్రభుత్వ అధికార పీఠంపై తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు మూడో అన్నయ్య నాగబాబు రాజకీయ ప్రయాణం మరో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీగా శాసనమండలిలోకి అడుగుపెట్టిన నాగబాబు.. ఇక తదుపరి మెట్టు కేబినెట్ వైపు వేస్తారా? అన్నదే ఇప్పుడు అసలు హాట్ టాపిక్! ఒకే కుటుంబం.. ముగ్గురు అన్నదమ్ములు.. ముగ్గురికీ భిన్నమైన ప్రయాణాలు.. కానీ గమ్యం మాత్రం ఇప్పుడు రాజకీయ అధికార కేంద్రం వైపే కనిపిస్తోంది. చిరంజీవి కేంద్రంలో మంత్రి.. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం.. నాగబాబు ఎమ్మెల్సీ.. ఇక మంత్రి పదవి దక్కితే మెగా కుటుంబ రాజకీయ కథలో మూడో అధ్యాయం పూర్తయినట్టే. అయితే ఇది కుటుంబ ముచ్చటగా ముగుస్తుందా? లేక కూటమి రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది అవుతుందా? రాజకీయ వర్గాల్లో మొదలైన ఈ చర్చ.. ఇప్పుడు మెగా అభిమానుల నుంచి ప్రత్యర్థి పార్టీల వరకు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అసలు ప్రశ్న ఒక్కటే.. మెగా బ్రదర్స్.. ఇక ‘మినిస్టర్స్’ బ్రదర్స్ అవుతారా?
#MegaBrothers #Nagababu #PawanKalyan #Chiranjeevi #MegaFamily #MegaFamilyPolitics #NagababuMLC #PawanKalyanDeputyCM #AndhraPradeshPolitics #JanaSena #APPolitics #NagababuMinister #PoliticalNews #MegaStar #MegaPolitics











